For Advertisement Enquiries Please Contact +91 7901268899

ఇదేం ధ 'రొయ్యో '.. ❗

img

. అడ్డగోలుగా ధర తగ్గిస్తున్న సిండికేట్ 
. పట్టించుకోని కూటమి సర్కార్ 
. ఆక్వా రైతుల్లో పెరుగుతున్న అసంతృప్తి 
. సాగు సమ్మె దిశగా వేగంగా అడుగులు 
. ధరలు గిట్టుబాటు కావంటూ ఆవేదన 
. పశ్చిమగోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో పంట విరామం 
. ఇతర జిల్లాలోని రైతులందరిది అదే బాట

 

రొయ్య రైతులు విలవిల్లాడుతున్నారు .గిట్టుబాటు ధర రాక సతమతమవుతున్నారు .ట్రంప్ సుంకాల పేరు చెప్పి ఎగుమతిదారులు అడ్డగోలుగా ధరలు తగ్గిచేయడంతో ఈ దుస్థితి తలెత్తింది .అయినా కూటమి సర్కారు పట్టించుకోవడం లేదు .ఫలితంగా రైతులు ఆవేదన చెందుతున్నారు .ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు .

సాగు సమ్మె బాట పడుతున్నారు .రాష్ట్రంలో ఇప్పటికే పట్టుబడి పూర్తయింది 25 శాతం విస్తీర్ణంలో మెజార్టీ రైతులు పంట విరామం దిశగా అడుగులు వేస్తున్నారు .ప్రభుత్వం ప్రకటించిన ,కంపనీలు చెల్లిస్తున్న ధరలు తమకు ఏమాత్రం గిట్టుబాటు కావని ఆవేదన చెందుతున్నారు .

 

పశ్చిమగోదావరిలో నిరసన గళం

 

వారం రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం శిరగాలపల్లి ,పాలకొల్లు మండలం చందుపర్రు గ్రామాల రైతులు సాగు సమ్మెకు శ్రీకారం చుట్టారు .తాజాగా ఇదే జిల్లాలో నరసాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామంతోపాటు పోడూరు మండల రైతులు కూడా సాగు సమ్మెకు సిద్దపడుతున్నారు .ఆక్వా సాగు ఇక చేయలేమని ,క్రాప్ హాలిడే పాటించాలని నిర్ణయిచామని చెరువుల వద్ద బోర్డులు పెట్టి మరీ నిరసన వ్యక్తం చేస్తున్నారు .ఏలూరు ,తూర్పుగోదావరి ,కృష్ణా ,డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ ,కాకినాడ ,నెల్లూరు,ప్రకాశం  జిల్లాల రైతులూ సాగు సమ్మెకు సిద్ధమవుతున్నారు .

 

5.72 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు

 

రాష్టంలో ఈ -ఫిష్ డేటా ప్రకారం 1.62 లక్షల మంది ఆక్వా రైతులు 5.72 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు .అత్యధికం గా ఏలూరు ,పశ్చిమగోదావరి ,కృష్ణా జిల్లాల్లోనే 1.20 లక్షల మంది 4.25 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు .

 

కౌంట్ ల పేరిట ..అడ్డగోలు దోపిడీ

 

ప్రస్తుతం పెరిగిన లీజు ,ఫీడ్ ,విద్యుత్ చార్జీల వల్ల రొయ్యలు 100 కౌంట్ కు రావాలంటే కిలోకు రూ .220-250 వరకు  ఖర్చవుతుంది .అదే  50 కౌంట్ కు చేరాలంటే కిలోకు రూ .330-350 వరకు ,గరిష్టంగా 30 కౌంట్ కు రావాలంటే కిలోకు రూ .450 చొప్పున ఖర్చవుతుంది .కానీ ప్రస్తుతం 100 కౌంట్  రూ .230,50కౌంట్ రూ .325,30 కౌంట్ రూ .425 చొప్పున కంపెనీలు ధరలు ప్రకటించాయి .

ఈ  ధరల్లోనూ ఎగుమతిదారులు ,ప్రాసెసింగ్ కంపెనీలు ,వ్యాపారులతోపాటు గ్రామ స్థాయిలో రొయ్యలు కొనుగోలు చేసే షెడ్ల నిర్వాహకులు సిండికేట్ గా మారి అడ్డగోలుగా కోత విధిస్తున్నారు .కిలోకు రూ .పది నుంచి రూ .30 వరకు కోత పెడుతున్నారు .1-3 టన్నుల్లోపైతే 100 కౌంట్ కు  రూ .220,50 కౌంట్ కు రూ .310,30 కౌంట్ కు రూ .400 చెల్లిస్తున్నారు .అదే నాణ్యత కొంచెం తక్కువగా ఉంటే ధరలో ఇంకా భారీగా కోత పెడుతున్నారు .

 

 

 

Languages

Shares

Related News