ఆక్వాకు మంచి రోజులు
రూ.1.50కే యూనిట్ విద్యుత్తు
రాయితీ నిబంధనల్లో మార్పులు
రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు వర్తింపు
కోవిడ్ సమయం నుంచి జిల్లాలో ఆక్వా రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనై సంక్షోభం వైపు పయనించింది.వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రధాన కారణంగా నిలిచాయి .దీనికి తోడు పెరిగిన మేతలు , మందుల ధరలు , లీజు వ్యవహారాలు మరింత ఇబ్బంది పెట్టాయి . ఆక్వా జోన్ల సమస్య , విద్యుత్తు ధరలతో ఏకంగా కుదేలైన స్థితికి తీసుకొచ్చాయి . తాజాగా కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు విద్యుత్తు రాయితీకి వెసులుబాటు కల్పించనుంది .
గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ యూనిట్ ధర రూ .1.50కే ఇస్తామని చెప్పిన అమలు కాలేదు . ఈ -ఫిష్ విధానంలో పలు నిబంధనలు విధించారు.వంద రొయ్యల ధర తెదేపా పాలనలో రూ . 250 నుంచి రూ .260 ఉండేది. వైకాపా వచ్చాక రూ . 180 పడిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు . ఉప్పు, మంచినీటి ఆక్వా జోన్లుగా విభజించారు . 10 ఎకరాల వరకు సాగు చేసిన రైతులకే యూనిట్ విద్యుత్తు ధర రూ .1.50కే వర్తింప చేస్తానన్నారు .పది హార్స్ పవర్ మోటార్ వినియోగించే రైతులకు రాయితీ వర్తించదని ,ఈ ఫిష్ విధానంలో చెరువులో లీజు ఒప్పందం ,లైసెన్స్ , విద్యుత్తు మీటర్ , భూమి , ఆన్లైన్ పత్రాలు ఇవ్వాలని మెలిక పెట్టారు . వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా యూనిట్ ధర రూ .6 చెల్లించాల్సి వచ్చేది . జిల్లాల్లో ఎక్కువ శాతం మంది ఆక్వాజోన్ పరిధిలో లేకపోవడం , రాయితీ వర్తించకపోవడంతో రూ.లక్షల్లో విద్యుత్తు బిల్లులు రావడంతో సాగు చేయడానికి గతంలో మొగ్గు చూపలేదు.
గతంలో కుదేలు
25 ఏళ్లుగా ఆక్వాపై ఆధారపడిన రైతులు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈ రంగంపై మక్కువ చూపలేదు . దీంతో జిల్లాలో వేలాది ఎకరాలు నిరూపపయోగంగా మారాయి.జిల్లాలో 451 మంది రైతులకు రాయితీ విద్యుత్తు కనెక్షన్లు ఉండగా , వీటిలో 220 మందికి మాత్రమే రాయితీ వర్తించేది .10 ఎకరాలలోపు ఉన్న చెరువులకే విద్యుత్తు రాయితీ పరిమితం చేయడంతో 70 శాతం రైతులపై విద్యుత్తు బిల్లుల భారం పడి ఈ రంగం కుదేలైంది .
ఆదుకుంది చంద్రబాబే
రాష్ట్ర తలసరి ఆదాయానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆక్వా రంగానికి 2014-19లో తెదేపా ప్రభుత్వం బాసటగా నిలిచింది .రూ .2కే యూనిట్ విద్యుత్తు అందరికీ అందించింది . దీంతో రైతులు ఆయిల్ ఇంజన్లు వదిలి విద్యుత్ ఏర్పాటు చేసుకొని లాభాల బాట పట్టారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం యూనిట్ ధర రూ 1.50 ప్రకటించడంతో హర్షం వ్యక్తమవుతుంది.
వెసులుబాటు
విద్యుత్తు బిల్లుల కష్టాల నుంచి విముక్తి కల్పించేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకేసింది . రూ .1.50కే యూనిట్ విద్యుత్తు అందించాలని కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నిర్ణయించారు . నిబంధనలు లేకుండా రాయితీ అందించనున్నారు . అర్హులైన రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకుని రాయితీ పొందడానికి వెసులుబాటు కల్పించారు .
. జిల్లాలో ఆక్వా సాగు విస్తీర్ణం : సుమారు 4 వేల హెక్టార్లు ..
. నిర్వాహకుల సంఖ్య : 1,500 మంది
. పనిచేస్తున్న కార్మికులు : సుమారు 10 వేల మంది
. సాగవుతున్న మండలాలు : సంతబొమ్మాలి ,గార , సోంపేట , ఇచ్ఛాపురం , వజ్రపు కొత్తూరు ,ఎచ్చెర్ల , పోలాకి
మార్గదర్శకాలు వచ్చిన వెంటనే అమలు:
జిల్లాలో 220 కనెక్షన్లకు మాత్రమే రాయితీ వర్తిస్తుంది .. మిగతా రైతులు నాన్ - ఆక్వా జోన్ పరిధిలో ఉండడం ,1బి ,అడంగల్ లేకపోవడంతో అవకాశం రాలేదు . ఆక్వా జోన్ , నానా ఆక్వా జోన్ తో సంబంధం లేకుండా రాయితీ అందిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది . మార్గదర్శకాలు వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి రాయితీ అందిస్తాం