90 రోజుల పాటు టారీఫ్స్ నిలిపివేత ..చైనాపై మాత్రం 125%కి పెంపు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు .చైనా తప్ప మిగతా 70 దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు .అదే సమయంలో చైనాపై టారిఫ్ ను 125%కి పెంచుతున్నట్లు తెలిపారు .చైనా ప్రపంచ మార్కెట్లను అగౌరపరిచిందని ,అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు .కాగా ,అమెరికా వస్తువులపై చైనా 84% టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే .