ఆక్వా రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందని మత్య్సశాఖ జిల్లా అధికారి ప్రసాద్ తెలిపారు . ఈనాడు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఫోన్ ఇన్లో ఆ ఆయన పాల్గొని సాగుదారుల సమస్యలు తెలుసుకొని పరిష్కార మార్గాలపై సూచలనాలిచ్చారు .
బీమవరం అర్బన్ న్యూస్ టుడే : ఆక్వా రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందని మత్స్యశాఖ జిల్లా అధికారి ప్రసాద్ తెలిపారు .ఈనాడు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఫోన్ ఇన్ లో ఆయన పాల్గొని సాగుదారుల సమస్యలు తెలుసుకొని పరిష్కార మార్గాలపై సూచనలిచ్చారు .పలు అంశాలపై వారి సందేహాలను నివృత్తి చేశారు .ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనతో ఆక్వా రైతులు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చన్నారు .
1 . రొయ్యల పంట బాగున్నపుడు కొనుగోలుదారులు ధర బాగా తగ్గించేస్తున్నారు . దీంతో చైనా రైతులు భారీగా నష్టపోతున్నారు .
కొద్దీ రోజుల కిందట ధర తగ్గడంతో సమస్య ఏర్పడింది .ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాక సమస్య పరిష్కారమైంది . ఇప్పుడు కౌంట్ వారిగా రొయ్యల ధరలు పెరిగాయి .