For Advertisement Enquiries Please Contact +91 7901268899

ట్రంప్ దెబ్బకు.. రొయ్యో మొర్రో..!

img

ట్రంప్ దెబ్బకు..  రొయ్యో మొర్రో..!

అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆక్వా రంగంపై  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూపంలో పిడుగు పడింది.రొయ్యలపై  ప్రస్తుతం ఉన్న 3 నుంచి 4 శాతం సుంకాన్ని అమెరికా  26 శాతానికి  పెంచినట్లు  వార్తలు  వస్తున్న నేపథ్యంలో గురువారం రొయ్యల కొనుగోళ్లు పూర్తిగా నిలిచి పోయాయి. 

అమెరికా సుంకాల  భయంతో నిలిచిన   కొనుగోళ్లు 
   
50 శాతానికి చేరిక ..!

కొత్త సుంకాలు అమలులోకి వస్తే రూ .లక్ష  విలువ చేసే రొయ్యలు అమెరికాకు ఎగుమతి చేయాలంటే రూ.26వేలు పన్ను కట్టాలి .రవాణా ,ప్యాకింగ్ ఇతర  ఖర్చులతో కలిపి 50 శాతానికి చేరుతుంది .ఈ మేరకు రొయ్యల ధరలు తగ్గి ఆ  భారం రైతులపై పడనుంది .

నిలిచిన వైనం ..

రెండు రోజులు క్రితం వరకు 100 కౌంట్  ధర  రూ .230 వరకు  ఉంది .ఇది  రూ .50-60 వరకు  తగ్గనుందని అంచనా .తాజాగా  ఈ కౌంట్ ధరను రూ.30 నుంచి రూ.40 వరకు తగ్గించేశారు .


సమావేశంలో నిర్ణయం తర్వాతే..

రొయ్యల  కొనుగోలుపై అమెరికా  సుంకాలపై రాష్ట్రంలో  రొయ్యల ఎగుమతిదారులు సమావేశం నిర్వహించి అమెరికా విధించిన సుంకాల ప్రభావం ఏ మేర ఉంటుంది ?వాటి వల్ల ఎంత ధర తగ్గించాలి ?ఏ విధంగా కొనుగోలు చేయాలి ?అనే అంశాలు చర్చించి ధరలు నిర్ణించనున్నట్లు సమాచారం .ప్రస్తుతం ఉత్ప్పత్తులు తీసుకుంటాం గాని,ధరలు మాత్రం సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఉంటాయని డీలర్లు చెబుతున్నారు .గత్యంతరం లేని పక్షంలో రైతులు వారి షరతులకు లోబడే పట్టుబడులు చేస్తున్నారు .

Languages

Shares

Related News