మొక్కేస్తున్నారోయ్యో!
డాలర్ పంటగా రొయ్యల సాగుకు పేరు.అందులో పిల్లలే కీలకం .నాణ్యమైన వాతావరణము అనుకూలిస్తే రైతుల పంట పండుతుంది . నాసిరకమైతే ఆరుగాలం శ్రమ కన్నీటి పాలవుతుంది.ఇటీవల మడగాస్కర్ టైగర్ రొయ్యలకు డిమాండ్ పెరిగింది రైతులు వీటిని పొందేందుకు ఆసక్తి చూపిస్తున్నారు . ఇదే ఆసరాగా కొందరు హేచరిలో నిర్వాహకులు అక్రమాలకు తెర లేపారు.
నాసిరకం సరఫరాతో నష్టాలు : ఒంగోలు ,కొత్తపట్నం , సింగరాయకొండ,టంగుటూరు , నాగులుప్పలపాడు మండలాల్లో మూడు దశాబ్దాల క్రితం టైగర్ రొయ్య సాగు ప్రారంభించారు . తెల్ల మచ్చ రోగం వ్యాప్తితో నష్టపోయారు. తర్వాత ఎల్ వనామి లాభాలు తెచ్చిపెట్టడంతో ఆ రకం సాగు జోరందుకుంది .ప్రస్తుత దాణా ధరలు పెరగడం ,పెట్టుబడికి తగినట్లుగా దిగుబడి రాని పరిస్థితి .ప్రస్తుతం పి -మోనోడాన్ బ్లాక్ టైగర్ రొయ్య రెండు , మూడేళ్లు లాభాలు తెచ్చిపెట్టింది.గుజరాత్ లో బిఎంసి నుంచి తెచ్చిన పిల్లలను ఇక్కడ హెచ్చరిల ద్వారా గత ఏడాది జనవరిలో సరఫరా చేశారు.నాసిరకమైన కావడంతో వి ఆరు నెలలు పెంచిన 15 గ్రాములకు మించి పెరగలేదు .ఈ పరిణామాలతో ఎకరాకు రూ . లక్ష చొప్పున రైతులు నష్టపోయారు .
మడగాస్కర్ పేరుతో మోసాలు : ఈ ఏడాది మడగాస్కర్ వైపు పలువురు మొగ్గు చూపుతున్నారు .నెల్లూరుకు చెందిన హేచరీల ద్వారా జిల్లాలో పిల్లలు సరఫరా అవుతున్నాయి .ఇక్కడే కొందరు నిర్వాహకులు మోసానికి పాల్పడుతున్నారు .ముందుగా నగదు వసూలు చేసి నాసిరకం పిల్లలు అంటగడుతున్నారు .అధిక మొత్తం వసూలు చేస్తున్నారు .బిల్లులు కూడా ఇవ్వడం లేదు రొయ్య పిల్లలు ఇచ్చేటప్పుడే పిసిఆర్ (పాలిమరైజ్ చైన్ రియాక్షన్)పరీక్ష చేసి రోగాలు ఏమీ లేవని ధ్రువీకరుణ పత్రం అందించాలి . చాలా చోట్ల వీటి ఊసే లేదు .ఈ విషయమై మత్స్యశాఖ జెడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ..నాణ్యమైన మడగాస్కర్ బ్లాక్ టైగర్ రొయ్య పిల్లలను పిసిఆర్ పరీక్ష దృవపత్రంతో పంపిణీ చెయ్యాలని హేచరీల నిర్వాహకులను సూచించినట్లు తెలిపారు .
జిల్లాలో రొయ్యల సాగు (ఎకరాల్లో..)
. మొత్తం విస్తీర్ణం : 11,000
. వనామీ రకం : 5,000
. బ్లాక్ టైగర్ రకాలు : 6,000