ఏపీలో మళ్ళీ మొదలైన టైగర్ రొయ్య సాగు
సాక్షి , భీమవరం : రెండు దశాబ్దాల క్రితం ఆక్వా రంగంలో రారాజుగా వెలుగొందిన మోనోడాన్ (టైగర్ రొయ్య ) వచ్చేసింది . గత సీజన్లో ప్రయోగాత్మకంగా సాగు చేసిన మడగాస్కర్ సీడ్ మోనోడాన్ రైతులకు కాసుల వర్షం కురిపించింది . దీంతో తీరం వెంబడి ఈ ఏడాది అధిక శాతం సాగు చేసేందుకు ఆక్వా రైతులు సన్నాహాలు చేస్తున్నారు . ఆక్వా లో 2002 సంవత్సరానికి పూర్వం టైగర్ రొయ్యదే హవా .ఈ రొయ్యకు లోకల్ మార్కెట్ తో పాటు అంతర్జాతీయంగా ఎగుమతులకు బాగా డిమాండ్ ఉండేది .క్రమంగా టైగర్ రొయ్యపై వైట్ స్పాట్ వైరస్ దాడి తీవ్రం కావడంతో ఆక్వా రైతులు నషాల్లో కూరుకుపోయారు .
ఆ తర్వాత 2011 లో వచ్చిన వెనామీ మూడేళ్ళపాటు రైతులకు అధిక లాభాలు తెచ్చిపెటింది .ఫలితంగా చాలా మంది పొలాలను ఆక్వా చెరువులుగా మార్చేస్తున్నారు . రాష్ర వ్యాప్తంగా సాగు విస్తరణం 4 .66 లక్షల ఎకరాలకు పెరగ్గా , ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే 2.5 లక్షల ఎకరాలు ఉంది .రాష్ట్రంలో సముద్ర తీరం వెంబడి 1 .05 లక్షల ఎకరాల్లో ఉప్పునీటి చెరువులు ఉన్నాయి .వెనామీ పైన 2014 నుంచి వైట్ స్పాట్ విబ్రియో , వైట్ గట్ , ఈహేచ్ పీ , వైరస్ లా దాడి మొదలైంది . రైతులు నష్టాలు చవిచూసున్నారు . ఆక్వా రైతులకు గత వైస్సార్సీపీ ప్రభుత్వం అప్పుడా ఏర్పాటు చేసి కొండంత అండగా నిలిచింది .
తీరం వెంబడి మొదలైన సాగు
చెన్నై కి చెందిన హేచరీ మూడేళ్ళ క్రితం మడగాస్కర్ ప్రాంతం లో సముద్ర జలాల నుంచి నాణ్యమైన మేల్ ఫిమేల్ మోనోడాన్ బ్రూడర్స్ సేకరించి సీడ్ ఉత్పత్తి ని ప్రారంభించాయి . 2023 లో కృష్ణా, పశ్చిమ గోదావరి , బాపట్ల , ప్రకాశం , శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు , తిరుపతి , కాకినాడ జిల్లాలోని సముద్ర తీరం వెంబడి 7200 ఎకరాల్లో మోనోడాన్ సీడ్ ను రైతులు సాగు చేశారు .వైరస్ బెదడలేకపోవడంతో , ఆరు నెలల పంట కాలానికి కెజికీ 20 కౌంట్ తో రూ .1050 వరకు ధర పలికి మంచి లాభాలు వచ్చాయి .దీంతో గత ఏడాది దాదాపు రెట్టింపు స్ధాయిలో ఈ సీడ్ ను సాగు చేశారు . పశ్చిమ గోదావరి జిల్లాలోని బియ్యపు తిప్ప, చినమైనవానిలంక , దర్భరేవు తదితర ప్రాంతాల్లో 520 ఎకరాల్లో సాగు చేశారు .ఆరు నెలలో అధికంగా ౨౦ కౌంట్ తీయగా , కొందరు ఎనిమిది నెలల కాలానికి 10 .5 నుంచి 11 కౌంట్ తీశారు. సాగు పెట్టుబడులకు రెట్టింపు లాభాలు వస్తుండటంతో ఈ సీజన్లో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలనే ఆరు వేల ఎకరాలకు పైగా సాగు చేసేందుకు రైతులు సిద్హమవుతున్నారు కాగా , చెన్నై తో పాటు మన రాష్ట్రం లోని ఐదారు హేచరీ ల్లో మాత్రమే మోనోడాన్ సీడ్ లభిస్తోంది .రొయ్య పిల్ల ధర రూపాయి వరకుఉంది . ఈ సీడ్ కావాల్సిన నెలలు ముందే డబ్బులు చెల్లించి బుకింగ్ చేసుకుంటున్నారు .మోనోడాన్ 15 నుంచి 20 శాతం వరకు ఉప్పు సాంద్రత ఉన్న నీటితోసాగుకు అనుకూలమని నిపుణులు చెబుతున్నారు .