జిల్లాలో ఆక్వా రైతు కుదేలవుతున్నారు . ఇష్టారాజ్యంగా విధ్యుత్ చార్జీల భారంతో ఎక్కువ మంది నష్టాలపాలైయ్యారు . క్రమంగా సాగుకు దూరమౌతున్నారు . ప్రస్తుతం మార్కెట్ ధర బాగున్నా సాగు విస్ట్రీర్ణం భారీగా తగ్గింది . పెరిగిన విధ్యుత్ చార్జీలు మేత ధరలు బాగా పెరగటంతో వారిపై తీవ్ర ప్రభావం చూపింది పలు హేచరీల మూత ....
హేచరీల్లో నాసిరకమైన సీడ్ , విధ్యుత్ చార్జీలుపెంపుతో పాటు గతంలో కంటే భారీగా పెరిగిన ఖర్చులతో దిగుబడి బాగున్నా ఆశించినంత లాభాలు దక్కడం లేదు . రొయ్యల ఎగుమతి దారులు సాగు తక్కువగా ఉండటంతో ధర పెంచారని , సాగు పెరిగితే ధర తగ్గిసారని ఆందోళన చెందుతున్నారు . ఎగుమతి దారులు , మేత కంపెనీదారులు అదును చూసి ధరలు తగ్గించడం , పెంచడం పరిపాటిగా మారింది .రాష్ట్ర వ్యాప్తంగా సాగు పరిస్ధితి ఇలాగె ఉందని పలువురు చెబుతున్నారు . జిల్లాలో 50 హాచేరీలకు పైగా ఉండగా ప్రస్తుతం 15 హేచరీలు మాత్ర్రమే నిర్వహణలో ఉండగా , మిగతావి మూతపడ్డాయి .డాలరు పంటగా పేరొందిన ఆక్వా ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోయింది .ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో సాగుదారుల్లో ఆశలు చిగురించాయి .ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అటు రొయ్యలు , మేత ధారాలపైనా కార్తీనా చర్యలు తీసుకుని నాణ్యమైన సీడ్ అందించేలా చేయాలని విన్నవిస్తున్నారు .
30 వేళా ఎకరాలకు తగ్గుముఖం ...
రొయ్యల ధర ఉరిస్తున్న ... ఆక్వా రైతులు సాగు చేసేందుకు ఆసక్తి చూపడంలేదు . రెండు దశాబ్దాలుగా ఎన్నో ఆటపోట్లును , సంక్షోభాలను ఎదుర్కొన్న ఆక్వా రైతులు నాలుగేళ్లుగా భారీగా నష్టపోయారు . 2021లో వరదలు , 2022 లో ధరల పతనం , 2023 విధ్యుత్ చార్జీలుధరల మోతతో సాగుదారులు కుదేలయ్యారు . గత ప్రభుత్వం సహకారం లేకపోవడంతో 80 వేలఎకరాల్లో సాగవుతుండగా ప్రస్తుతం 30 వేల ఎకరాలకు పరిమితమైంది .కొందరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు . నాలుగు నెలలుగా 100 కౌంట్ ధర రూ . 190 నుంచి రూ . 260 పెరిగి నిలకడగా ఉన్నపటికీ సాగు చేయాలంటే భయపడుతున్నారు.
soure : Eenadu , nellore