ఆక్వా సాగుకు అష్ట కష్టాలు
ఆక్వా రంగం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది.2014 సంవత్సరానికి ముందు ఆయిల్ ఇంజన్ లకు అయ్యే ఖర్చుతో సాగు దారులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్న క్లిష్ట సమయంలో తెదేపా ఆక్వాను ఆదుకుంది.విద్యుత్ యూనిట్ ను 2 రూపాయల చొప్పున రాయితీ ,కనీస ఖర్చులతో ట్రాన్స్ ఫార్మర్లు ,సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టడంతో ఆక్వా లాభాల బాట పట్టింది ఈ విధానాలతో రైతులందరికీ మేలు జరిగింది. ఆ తరువాత వైకాపా ప్రభుత్వం ఆక్వా రంగాన్ని జోన్లుగా విభజించడంతో కుదేలయ్యింది .విద్యుత్తు రాయితీలు పోయాయి . మేత ధర అధికమైంది . పండించిన పంటకు దళారులు సిండికేట్ ధర కల్పించకపోవడంతో రైతులు పూర్తిగా నష్టాలు పాలయ్యారు . రాష్ట్రంలో లక్షలాది మందికి ప్రత్యేకంగా , పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఈ రంగానికి కూటమి ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకోవాలి
రాయితీ కోల్పోయి
ఆక్వా రైతులకు యూనిట్ రూ .1.50 కి ఇస్తామన్న వైకాపా 2019లో అధికారంలోకి వచ్చాక . ఆక్వా , నాన్ ఆక్వా జోన్లను తీసుకొచ్చింది . దీంతో 60 శాతం రైతులు విద్యుత్తు రాయితీ కోల్పోయారు . నాన్ ఆక్వా జోన్లో రైతులకు నియంత్రికల ఏర్పాటుకు ఆటంకాలు ఏర్పడ్డాయి.సబ్ స్టేషన్ల ఏర్పాటులో అలసత్వంతో అధికలోడు సమస్య సాగుదారులకు తీవ్ర కష్ట , నష్టాలను తెచ్చి పెట్టింది .
కూటమి ప్రభుత్వం పైనే ఆశలు
ఆక్వా సాగుకు మొదట్నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు , ఆక్వా ను ఆదుకుంటామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు .ఈ నేపథ్యంలో హామీని నెరవేరుస్తారని ఆక్వా రైతులు ఎదురుచూస్తున్నారు.జోన్లతో సంబంధం లేకుండా ప్రతి ఆక్వా రైతుకు లాభం చేకూరేలా ప్రభుత్వ రాయతీలు కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు .