cm chandrababu:100 కౌంట్ రొయ్య కిలోకి రూ.220
అమెరికా సుంకాల పేరుతో ఆక్వా రైతులకు ఇచ్చే ధరలు తగ్గించవద్దని..100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ .220 చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్వా ఎగుమతి వ్యాపారులకు సూచించారు.k
ఎగుమతి వ్యాపారులకు సీఎం సూచ
ఆక్వా రంగ సమస్య పరిష్కారానికి భాగస్వాములతో కమిటీ
గోదావరి జిల్లాల్లో ఆక్వా చెరువులకు నీరుఇస్తామని ప్రకటన
అమెరికా సుంకాల భారంపై సచివాలయంలో చర్చ
సుంకాల భారం నుంచి బయటపడటంతో పాటు ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు ఆక్వా రైతులు ,ఆక్వా రంగ నిపుణులు ,ప్రభుత్వ అధికారులు ,భాగస్వాములు ,ఎంపెడా ప్రతినిధులు ,ఎగుమతిదారులు .మొత్తం 11 మందితో కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు .గోదావరి జిల్లాల్లో ఆక్వా చెరువులకు కాలువల ద్వారా నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు .
రొయ్యల ఎగుమతిపై అమెరికా సుంకాల విధింపు నేపథ్యంలో రైతులు ,ఎగుమతి వ్యాపారులు ,హేచరీలు ,దాణా తయారీ సంస్థల ప్రతినిధులతో సోమవారం రాత్రి సచివాలయంలో సుమారు 2.30 గంటలకు పైగా నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై సీఎం చర్చించారు.రైతుల ఇబ్బందులపై వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు .దీర్ఘకాలంలో స్థానికి వినియోగం పెంచడం ,అదనపు విలువ జోడించడంపై దృష్టి పెట్టాలని రైతులకి చూచించారు .కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు .'రాష్ట్ర జిడిపి లో మత్య్సరంగ కీలక భూమిక పోషిస్తుంది .సుంకాల కారణంగా సంక్షోభం ముంగిట ఉన్న ఆక్వా రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం 'అని హామీ ఇచ్చారు .100 కౌంట్ రొయ్యకు రూ .220 తగ్గకుండా ధర చేల్లిస్తామని.ఎగుమతి వ్యాపారులు సీఎం హామీ ఇచ్చారు .
కొత్త మార్కెట్ అవకాశాలపై కేంద్రంతో చర్చిస్తాం..
దక్షిణ ,కొరియా ,యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో ప్రీ ట్రేడ్ ఒప్పదం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఎగుమతిదారులు చెప్పారు .దీనిపై కేంద్రంతో మాట్లాతామని సీఎం హామీ ఇచ్చారు .ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని ..మళ్ళి సంప్రదిస్తామని చెప్పారు .'ఆక్వా సాగులో 3 లక్షల మంది రైతులున్నారు .ఈ రంగంపై ప్రత్యక్షంగా ,పరోక్షంగా మరో 50 లక్షల మంది ఆధారపడి ఉన్నారు .ఇది ఊహించని సమస్య రైతులు ఓపికగా ఉండాలి .తప్పకుండా పరిష్కారం సాధిద్దాం' అని భరోసా ఇచ్చారు .
మేత ధర తగ్గించాలని రైతులు కోరగా ..వారి సమస్యలు వారికీ ఉంటాయని సీఎం పేర్కొన్నారు .రైతులు ,ఎగుమతి వ్యాపారులు ,హేచరీ,ఫీడ్ మిల్లులతో ఏర్పాటు చేసిన కమిటీ ధరలు సహా అన్ని అంశాలపైనా చర్చిస్తుందని అప్సడా విశే చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి వివరించారు .మంగళవారం నుంచి నిర్వహించాల్సిన రైతు సదస్సులు రద్దు చేశామని .దీని స్థానంలో ఎగుమతి వ్యాపారులతో కలిసి వెళ్లి రైతులకు భరోసా ఇవ్వాలని సీఎం సూచించారని సమావేశం తర్వాత విలేకర్లకు చెప్పారు .