For Advertisement Enquiries Please Contact +91 7901268899

నాణ్యమైన టైగర్ రొయ్య పిల్లలు రైతులకు సరఫరా

img

నాణ్యమైన టైగర్ రొయ్య పిల్లలు రైతులకు సరఫరా అయ్యే విధంగా చూడాలని రొయ్యల రైతుల సంఘం ప్రకాశం జిల్లా కమిటీ కోరిన మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ గారు టైగర్ రొయ్య పిల్లలు ఉత్పత్తి చేసే హేచరీ వారితో , prawn farmers association బాధ్యులతో జాయింట్ సమావేశం ఏర్పాటు చేసి సమస్య గురించి చర్చించడం జరిగింది .
సమావేశంలో రొయ్యల రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు దుగ్గినేని గోపీనాద్ మాట్లాడుతూ గత సంవత్సరం రైతులు నాసిరకం రొయ్య పిల్లలు వల్లబాగా నష్టపోయారని , ఈ సంవత్సరం అలా కాకుండా చూడాలని ,అందుకోసం ముందు జాగ్రత్తగా రైతులు కొనుగోలు చేసిన రొయ్యపిల్లల కు తప్పనిసరిగా బిల్లుతో పాటు సీడ్ ప్యాక్ చేసిన ట్యాంక్ సంబంధించిన క్వాలిటీ సర్టిఫికెట్ కూడా ఇప్పించాలని జేసీ గారిని కోరడం జరిగింది .
జేసీ గోపాలకృష్ణ గారు స్పందిస్తూ ప్రస్తుతం ఉన్న డిమాండ్ మేరకు రైతులకు మొత్తం క్వాలిటీ సీడ్ మాత్రమే సరఫరా చేయాలని , రైతులకు బిల్లు తో పాటు క్వాలిటీ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలని ఆదేశించారు .హేచరీ ప్రతినిధులు యూని బై రామరాజు , సీపీ గణేష్ రైతులు కోరిన విధంగా బిల్లుతో పాటు క్వాలిటీ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పారు .అలాగే క్వాలిటీ సీడ్ మాత్రమే రైతులకు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు .సమావేశంలో మత్స్యశాఖ జెడి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .

Languages

Shares

Related News