For Advertisement Enquiries Please Contact +91 7901268899

రొయ్యకు కొయ్యగా 'ట్రంప్' రితనం

img

రొయ్యకు కొయ్యగా 'ట్రంప్' రితనం

అమెరికాలో ఉంటున్న విద్యార్థులు,ఉద్యోగుల జీవితాలను  తలకిందులు చేసిన  ఆ దేశ అధ్యక్షుడు  ట్రంప్ మన రొయ్యని వదలలేదు .

                      అమెరికా సుoకాలతో  ధరల పతనం 
                      దిక్కుతోచని  స్థితిలో సాగుదారులు

అమెరికాకు ఎగుమతి అవుతున్న రొయ్యలపై సుంకం విధించడంతో  ఆక్వా రైతులతో పాటు  ప్రధానమైన పది రకాల అనుబంధ రంగాలపై  ఆధారపడిన  లక్షలాది కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో  పడ్డాయి .
రైతే తొలి బాధితులు . నెలల వ్యవధిలో  కిలో రొయ్య ధర  రూ .10 తగ్గితేనే  విలవిల్లాడిపోతున్న పరిస్థితుల్లో  ఒక్కరోజులో  రూ .40తగ్గేసరికి  రైతుకు ఊపిరి ఆడటం లేదు .. 100 కౌంటు రావడానికి రైతుకు  రూ .230-240 వరకు  ఖర్చవుతున్న నేపథ్యంలో  ప్రస్తుతం ధర  రూ .240 గా ఉంది . చెరువులో వేసిన పిల్ల కనీసం  80 శాతం పెరిగితే  ఈ ధరకు పెట్టుబడులు వస్తాయి. రూ .240 కంటే  ధర తగ్గిన  ఆశించిన సరుకు దొరక్కపోయినా  ఎకరాకు సగటును రూ . 2 లక్షల   వరకు  నష్టం వాటిల్లుతుంది . ఇది అక్కడితో ఆగుతుందా ? ఇంకా కిందకి పడిపోతుందా ? అనే భయం సాగుదారులను వెంటాడుతుంది .

అనుబంధ రంగాలు కుదేలు  

రొయ్య  పిల్ల తయారీ కేంద్రాలు.  మేతలు , మందులు తయారీ పరిశ్రమలు , విక్రయ దుకాణాలు .. ఫ్యాన్ సెట్లు తయారీ , విక్రయ కేంద్రాలు .. జనరేటర్లు అద్దెకిచ్చే వ్యాపారాలు .. ఐస్ ప్లాంట్లు .. లారీలు , ఇతర రవాణా వాహనాలు .. ప్రాసెసింగ్ ప్లాంట్లు .. పెట్రోల్ బంకులు .. పట్టుబడులపై ఆధారపడే కూలీలు .

ఇంకా ధరలు  నిర్ణయించలేదు  

స్థానికంగా  ధరలు నిర్ణయం ఇంకా జరగలేదు .. ఈనెల  8 ,9 తేదీల్లో కైకలూరు ,  ఉండిలో అప్సాడా వైస్ చైర్మన్, మత్స్యశాఖ కమిషనర్ , ఆక్వా అనుబంధ రంగాల  ప్రతినిధులు , రైతులతో సమావేశం నిర్వహించనున్నారు .అందులో ఆక్వా సాగులోని సమస్యలన్నీ చర్చకు వస్తాయి . రొయ్యలకు కనీసం మద్దతు ధర ఉండే విధంగా ఒత్తిడి తీసుకొస్తామని.జిల్లా రొయ్య రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు  నంబూరి గణపతిరాజు వివరించారు .

ఉమ్మడి జిల్లాల్లో  ఎకరాల్లో 

ఆక్వా సాగు మొత్తం :2.90
రొయ్యలు 1.10
చేపలు 1.80
వార్షిక ఉత్పత్తి :4 లక్షల టన్నులు 
విదేశాలకు ఎగుమతి 3.5 లక్షల టన్నులు 
వార్షిక టర్నోవర్  రూ .18 వేల కోట్లు

Languages

Shares

Related News