రొయ్యకు లోకల్ మార్కెట్
. స్థానిక వినియోగం పెంచే ప్రయత్నాలు
. ఏడదిన్నర క్రితమే రొయ్యల డోర్ డెలివరీకి కార్యచరణ
. పైలెట్ ప్రాజెక్టుగా భీమవరం ఎంపిక
. ఎన్నికలు రావడంతో నిలిచిన ప్రక్రియ
. తర్వాత పట్టించుకోని కూటమి ప్రభుత్వం
రొయ్యల ధరల స్థిరీకరణకు స్థానిక వినియోగం పెంచడం మంచి పరిష్కారమని చెబుతున్నారు . ఆ దిశగా ప్రముఖులతో ప్రమోషన్ చేయించాలని , చికెన్ షాపుల్లోనూ రొయ్యల అమ్మకాలు చేయాలని ఫ్రాన్స్ కో-ఆర్డినేషన్ కమిటీ నిర్ణయించింది .గత వైయస్సార్సీపి ప్రభుత్వం లో సిద్ధం చేసిన లోకల్ మార్కెట్ కాన్సెప్ట్ ను ఎప్పుడు కూటమి కమిటీ తెరపైకి తెస్తుంది .ఏడాదికి ఒక్కొక్కరు 10-12 కిలోల సగటు వినియోగంతో రొయ్యలు ఎక్కువగా తినే దేశాల్లో చైనా టాప్ లో ఉంటే 8-10కిలోలతో అమెరికా రెండో స్థానంలో .
యూరోపియన్ దేశాల్లోని సగటున ఒక్కొక్కరు 8 కిలోల వరకు తీసుకుంటారు . ప్రపంచ దేశాలకు రొయ్యలు ఎగుమతి చేసే మన దేశంలో మాత్రం సగటు వినియోగం 800 గ్రాములు మాత్రమే .ఆక్వా ఉత్పత్తులు , ఎగుమతుల్లో దేశంలోనే మొదటి స్థానం లో ఉన్న ఏపీలో వినియోగం 1.5 కిలోలు ఉన్నట్లు ఫిషరీస్ వర్గాలు చెబుతున్నాయి . రాష్ట్రంలో 5.75 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుంటే అత్యధికంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 2.63 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉంది .ఏటా సుమారు మూడు లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తితో జిల్లా మొదటి స్థానంలో ఉంది .టిడిపి హయాంలో నకిలీ సీడు , ఫీడు ,దళారుల దోపిడీతో కుదేలైన ఆక్వారంగానికి గత ప్రభుత్వం కొత్త ఊపిరిలూదింది.ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ ( అప్సడా)ఏర్పాటుచేసి రొయ్య ధరలను లాభసాటి చేయడంతో పాటు ,మేత ధరలను తగ్గించి , ఫీడ్ కంపెనీలు ఇష్టానుసారం పెంచకుండా నియంత్రించింది . నాన్ ఆక్వా జోన్ పరిధిలోని వేలాది ఎకరాలను ఆక్వా జోన్ పరిధిలోకి తెచ్చి విద్యుత్ రాయితీ అందజేసింది .
రైతులకు న్యాన్యమైన సీడ్ , ఫీడ్ అందేలా చర్యలు తీసుకుంది . ఫిష్ ఆంధ్ర ద్వారా డొమెస్టిక్ వినియోగం పెంచేందుకు మహిళలు , ఎస్సీ , ఎస్టీ వర్గాల వారికి 60 శాతం , మిగిలిన వారికి 40 శాతం రాయితీపై జిల్లా వ్యాప్తంగా రూ . లక్ష నుంచి రూ.మూడు లక్షల విలువైన 250కు పైగా అవుట్లెట్లు ఏర్పాటు చేశారు .ఫోర్ వీలర్స్ , టూ వీలర్స్ సబ్సిడీపై అందించారు .
రొయ్యల డోర్ డెలివరీ కి కార్యచరణ
క్వాలిటీ రొయ్యలను స్థానికంగా సామాన్య వినియోగదారుల చెంతకు చేర్చేలా రొయ్యల డోర్ డెలివరీ కి ఏడాదిన్నర క్రితం వైయస్సార్ సీపీ ప్రభుత్వం కార్యచరణ చేసింది .ప్రభుత్వ సహకారంతో ఈ ప్రక్రియ అమలుకు ఏపీ రొయ్య రైతుల ఫెడరేషన్ అప్పట్లో ముందుకు వచ్చింది . ఎక్స్పోర్ట్ తరహాలో ప్రాసెస్ చేసి రొయ్య పప్పు కౌంటును బట్టి రూ .600 నుంచి రూ .850వరకు ధర నిర్ణయించారు .
తొలుత జిల్లాలోని భీమవరం పరిసర ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి తరువాత రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ నగరాలు , పట్టణాలకు విస్తరింప చేయాలని భావించారు .2023 మత్స్యశాఖ జిల్లా అధికార వర్గాలు అందుకు అవసరమైన చర్యలు చేపట్టారు . ఈలోగా ఎన్నికలు హడావిడి మొదలు కావడంతో ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చలేదు .
మరుగును పడేసిన కూటమి
కూటమి ప్రభుత్వం రొయ్యల స్థానిక వినియోగం పెంచే కార్యచరణను మరుగున పెట్టేసింది . అమెరికా ప్రతికార సుంకాలు అమల్లోకి రాకపోయినా వాటిని సాకుగా చూపించి రెండు వారాలుగా ఎగుమతి దారులు రొయ్య ధరలను కౌంట్ కు రూ.40 నుంచి రూ .90 వరకు తగ్గించి కొనుగోలు డం వల్ల చేస్తుండడం పట్ల రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది . మేత ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు . ఈ తరుణంలో మంగళవారం విజయవాడలో భేటీ అయిన ప్రాన్స్ కో - ఆర్డినేషన్ కమిటీ స్థానిక వినియోగం పెంచడం లక్ష్యంగా కార్యచరణ నిర్ణయించడం గమనార్హం .
రొయ్యల ప్రాముఖ్యతను వివరిస్తూ సినీ నటులు , ప్రముఖులతో ప్రమోషన్ చేయించాలని ,120,250,500 గ్రాములుగా ప్యాకెట్లు చేసి విక్రయించాలని ,చికెన్ షాపుల్లో సైతం వీటిని అందుబాటులో ఉంచాలని ప్రతిపాదించాడు .భవిష్యత్తులో ఆ దిశగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు . గత ప్రభుత్వం కోవిటి సమయంలో సైతం రొయ్య ధరలు తగ్గుకుండా రైతులుకి అండగా నిలిచి మద్దతు ధర అందించింది .
తర్వాత కాలంలో ధరలు తగ్గించకుండా ఎక్స్ పోర్ట్స్ పై నిరంతరం ఉంచింది . స్థానిక వినియోగం పెంచేందుకు కృషి చేసింది . అదే మాదిరి ఓటమి ప్రభుత్వం స్థానిక వినియోగంతో పాటు ఎక్స్ పోర్ట్స్ పై ఒత్తిడి తెచ్చి రొయ్య ధరలను రైతులకు లాభసాటి చేసేందుకు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు .