విద్యుత్ సమస్యలు తీరుతాయి
రొయ్యల రైతుల విద్యుత్ రంగ సమస్యలపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రివర్యులు D బాలవీరాంజనేయుస్వామి గారి వద్దకు రొయ్యల రైతుల సంఘం (prawn farmer's association) ఆధ్వర్యంలో రొయ్యల రైతుల రాయభారం కార్యక్రమం జరిగింది.
మంత్రి గారికి రొయ్యల రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్తు సమస్యలు, పది ఎకరాలు పైన ఉన్న రొయ్యల రైతులకి సబ్సిడీ విద్యుత్ అందని విషయాన్ని, కొత్తగా స్మార్ట్ డిజిటల్ మీటర్లు బిగిస్తున్న విషయాలను వివరించడం జరిగింది.
మంత్రి గారు జిల్లా విద్యుత్ శాఖ se గారితో ఫోన్ సంప్రదించి స్థానికంగా ఉన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కారం చెయ్యమని ఆదేశించడం జరిగింది.
అలాగే డిజిటల్ స్మార్ట్ మీటర్లు అంశం, సబ్సిడీ విద్యుత్ అంశం ముఖ్యమంత్రి గారితో, విద్యుత్ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రొయ్యల రైతుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దుగ్గినేని గోపీనాథ్, k. సుబ్బరెడ్డి, సంఘం గౌరవఅధ్యక్షులు పమిడి సుబ్బానాయుడు, జిల్లా నాయకులు దివి హరిబాబు, కోటపాటి వెంకటేశ్వర్లు, నార్నె రమేష్, ఉప్పలపాటి నాగరాజు, కాసుకుర్తి భాస్కర్, నార్నే సతీష్ మరియు కొత్తపట్నం,టంగుటూరు,సింగరాయకొండ,ఒంగోలు మండలాలకు చెందిన రొయ్యల రైతులు పాల్గొన్నారు.
ఇట్లు
D. Gopinadh
President
Prawn farmers association
Prakasam district