ఆక్వా కుదుటపడుతుంది
'ఆక్వా రంగం ' కుదుట పడుతుంది .అమెరికా సుంకాల వాయిదాతో ఎగుమతులు ఊపందుకుంటున్నాయి .రొయ్య ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి .ఈ పరిణామాలు రైతుల్లో ఆశలు చిగురింపచేస్తున్నాయి .
క్షేత్రస్థాయిలో కల్లోలం ..అమెరికా సుంకాల ప్రకటనతో క్షేత్రస్థాయిలో 100 కౌంటు ధర రూ .240 నుంచి రూ .190-200కి పడిపోయింది .30 కౌంటు రూ .470 నుంచి రూ .390-400కి దిగిపోయింది .రూ .50 నుంచి రూ .80 వ్యత్యాసం రావడం తో సాగుదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.అత్యవసరంగా పట్టుబడులు చేసిన రైతులు ఎకరాకు రూ .1-2 లక్షల వరకు నష్టపోయారు .
ఫలించిన ప్రభుత్వ ప్రయత్నం .. ఈక్రమంలో ఆక్వాను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రాబాబు చేసిన ప్రయత్నాలు ఫలించాయి .రొయ్యల మేతల ధరలు టన్ను రూ .4 వేలు తగ్గడంతో పాటు రొయ్య ధరల్లో క్రమంగా నిలకడ వస్తోంది .
దళారుల హవా తగ్గింది ..'ఆక్వాలో ఏ చిన్న సమస్య వచ్చినా సొమ్ము చేసుకునే దళారుల వ్యవస్థకు అడ్డుకట్ట పడింది .మేతల ధరలు తగ్గడం ,రొయ్యల ధరలు పెరుగుతుండటంతో సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి ' అని భాస్కరరావుపేటకు చెందిన ఆక్వా రైతు పోకల దుర్గాప్రసాద్ అన్నారు .
పెద్ద కౌంటు ధర పెరగాలి.. 'సుంకాల నెపంతో 50,40,30 కౌంట్ల ధర భారీగా తగ్గించారు .పంట విరామం దిశగా రైతులు ఆలోచిస్తున్న సమయంలో కూటమి ప్రభుత్వం ఆక్వాను బతికించింది.వారం రోజులుగా ధరలు పెరుగుతున్నాయి .పెద్ద కౌంటు ధర కిలోకు ఇంకో రూ .20-30 వరకు పెరిగితే కాస్త ఊరటగా ఉంటుంది 'అంటున్నారు కొండంగికి చెందిన రొయ్యల రైతు ఇమ్మానేని చంద్రశేఖర్ .