‘ఆక్వా’పై అధ్యయనానికి కమిటీ
సుంకాలు, సవాళ్లకు పరిష్కారం దిశగా ..
అమెరికా విధించిన సుంకాలతో సహా రాష్టంలో ఆక్వా రంగం ఎదురుకొంటున్న సవాళ్ళను అధ్యయనం చేసి ,పరిష్కార మార్గాలు సూచించడానికి ఆక్వా వాటాదారులు ,అధికారులతో కూడిన 'ఆక్వా కల్చర్ సలహా కమిటీ 'ని ప్రభుత్వం నియమించింది .అమెరికా సుంకాలతో ఉత్పన్నమయ్యే సమస్యలు ,వాటిపై తీసుకోవాల్సిన చర్యలపై ఈ నెల 7న సీఎం చంద్రబాబు సమక్షంలో చర్చ జరిగింది .ఈ సందర్భంగా ఆక్వా రంగంలో తలెత్తిన సవాళ్ళను అధ్యయనం చేసి ,పరిష్కారాలు కనుగొనడనికి ఆక్వా భాగస్వాములతో కమిటీని మత్య్సశాఖ ప్రతిపాదించింది .ఈమేరకు కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వలు జారీ చేసింది .
కమిటీ కాలపరిమితి : కేంద్ర ప్రభుత్వం, ఎంపెడా ,అధికారులు ,ఆక్వా భాగస్వాములతో సమావేశాలు నిర్వహించి అమెరికా సుంకాల ప్రభావం ,స్వల్పకాలిక పరిష్కారాలపై ప్రాథమిక నివేదికను ఐదు రోజుల్లో ఇవ్వాలి .మధ్యస్థ ,దీర్ఘకాలికంగా తీసుకోవలసిన చర్యలపై 3 వారాల్లోపు వివరణాత్మక నివేదిక సమర్పించాలి .
కమిటీ నిబంధనలు : రొయ్యల ఎగుమతికి ప్రత్యమ్నాయ మార్కెటులను గుర్తించడం. దేశీయంగా సముద్ర ఆహార వినియోగాన్ని పెంచడం.నేషనల్ ప్రాన్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు .రక్షక దళాల మెనూలో రొయ్యలను ప్రెవేశపెట్టడం .ఫీడ్ డైనమిక్ ధరల అమలు ...తదితర సమస్యలను ఈ కమిటీ పరిష్కారాలు కనుక్కుంటుంది .
సలహా కమిటీ సభ్యులు:
ఆక్వా ఎగుమతిదారులు:
ఆనంద్ (పశ్చిమ గోదావరి )
ఆనంద్ కుమార్ (కృష్ణా )
వెంకట్ , దిలీప్ (విశాఖపట్నం)
ఆక్వా రైతులు:
రఘు (కాకినాడ )
కుమార్ రాజు (కృష్ణా )
శ్రీకాంత్ (నెల్లూరు)
రామరాజు ,సుబ్బరాజు (పశ్చిమగోదావరి )
దాణా కంపెనీలు:
సుబ్రహ్మణ్యం (కృష్ణా)
హేచరీస్ నిర్వాహకులు :
కుమార్ (అనకాపల్లి )
ఎస్ఎన్ రెడ్డి (కాకినాడ )
ప్రభుత్వ ప్రతినిధులు :
ఫుడ్ ప్రోసెసింగ్ సొసైటీ సిఈఓ శేఖర్ బాబు ,మత్య్సశాక ఏడి అంజలి ,ఎంపెడా జేడీ విజయకుమార్ ,ఎక్స్పోర్ట్ ఇన్ఫెక్షన్ ఏజెన్సీ డిడి అవినాష్ వధవ