అమరావతి : వైకాపా పాలనలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్న ఆక్వా సాగును గాడిన పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది . 2024 -29 మధ్య 30% వృద్ధి లక్యంగా దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేయనుంది . విజయవాడలో ఆదివారం నుంచి జరుగుతున్న'ఆక్వా కల్చర్ ఇన్నోవేషన్ టెక్ 2 .0 ' లో ఇందుకు సంబంధించిన విధానాలను ఆవిష్కరించారు . సోమవారం జరిగిన కార్యక్రమాల్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు , ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశేఖర , కమిషనర్ రామేశంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు .
రూ .3 .7 లక్షల కోట్ల జీవిఏ లక్ష్యం
1 .మత్స్య రంగంలో అదనపు స్థూల విలువ జోడింపు రూ 1 .01 లక్షల కోట్ల నుంచి 2024 -29 నాటికి రూ. 3 .7 లక్షల కోట్లకు చేర్చడం .
2 . ఆక్వా సాగును 5 .56 లక్షల ఎకరాల నుంచి 6 .81 లక్షల ఎకరాలకు పెంచడం
3 . కౌలు రైతులకు రూ .15 వేలకోట్ల నుంచి రూ . 20 వేల కోట్ల సంస్ధాగత మద్దతు
4 .ఐఓటీ ఆధారితం , సెన్సార్లు ఏరియాట్ర్స్ ,రిమోట్ సెన్సింగ్ , బ్లాక్ చైన్ , ఐఏ, ఎంఎల్ ద్వారా విశ్లేషణా
5 . మౌలిక సౌకర్యాలు , భీమా , సాంకేతిక , విత్తనం , దాణా , విధ్యుత్ కి ఏడాదికి రూ. 800 నుంచి 1000 కోట్ల బడ్జెట్ .
6 . వ్యాధులు , విపత్తులు , పెట్టుబడుల నష్టాలను అధిగమించి సుస్ధిరత సాధించేలా సమీకృత భీమా పధకాల అమలు .
2028 - 29 నాటికి ఉత్పత్తి లక్ష్యాలు
1 . ఆక్వా కల్చర్ ను 52 .95 లక్షల టన్నుల నుంచి 111 .27 లక్షల టన్నులకు పెంచడడం
2 . ఇన్లాండ్ ఫిష్ 60 లక్షల టన్నులు , మంచి నీటి , ఉప్పునీటి రొయ్యలు 49 లక్షల టన్నులు , సముద్రపు చేప , రొయ్యల ఉత్పత్తి 10 లక్షల టన్నుల లక్ష్యం
అభివృద్ధి లక్ష్యాలు
1 . రైతులు , ఎగుమతిదారులకు సాధికారత కల్పించడం .
2 . అత్యాధునిక సాంకేతిక విధానాల అమలు
3 . ఫిన్ టెక్ సోలుషన్స్
4 . భీమా అమలు చేయడం
5 . అధునాతన వ్యాధి నియంత్రణ విధానం
6 . జియో ట్యాగింగ్
7 . స్ధానిక వినియోగం పెంచడం .
source : eenadu