అమరావతి : ఆక్వా రైతులకు బ్యాంకు రుణాలిపిస్తామని .. ప్రైవేట్ అప్పులకు వెళ్లకుండా చూసే బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు . పధ్ధతి ప్రకారం ఆక్వా సాగు చేసుకుంటే సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తాం . తప్పు చేసే వారి విషయంలో కఠిన చర్యలు తీసుకుంటాం . అని స్పష్టం చేశారు . గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టైనబుల్ ట్రాంఫోర్మషన్ ఆధ్వర్యంలో విజయవాడలో మూడు రోజులుగా జరుగుతున్న 'ఆక్వా కల్చర్ ఇన్నోవేషన్ టెక్ 2 .0 ' కాంక్లేవ్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు . ఆక్వా రంగం ద్వారా రైతులకు ఆదాయం , ప్రభుత్వానికి ఏటా రూ . 1 .30 లక్షల జివిఐ అందుతున్న కాలుష్యం వల్ల స్ధానికంగా తాగడానికి నీరు పనికి రావట్లేదని బాధ ఉంది . ఈ పరిస్ధితి మారాలి . గ్రీన్ ఎనర్జీ అందిపుచ్చుకోవాలి .ఆక్వా ఫారాలు , పరిమిశ్రమలో పెద్ద ఎత్తున సౌర విధ్యుత్ ఉత్పత్తి చేయాలి . అని సూచించారు . ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కొన్ని మాట్లాడలేకపోతున్న .విధ్యుత్ చార్జీలు సహా .. ఆక్వా రంగం విషయంలో త్వరలో కీలక నిర్ణయాలు తీసుకుంటాం .ఆక్వా రైతులకిస్తున్న రుణాలు రూ . 3 వేల కోట్లే . బ్యాంకులతో మాట్లాడి వీలైనంత ఎక్కువగా రుణాలు ఇపిస్తాం అని తెలిపారు .
ట్రేసబిలిటి , సర్టిఫికేషన్ తప్పనిసరి
రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యే ఉత్త్పతే ప్రపంచ మార్కెట్లో తిరస్కరణకు గురికాకూడదు . రైతులు సీడ్ , ఫీడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి .ఆంటిబయోటిక్స్ ను పూర్తిగా నియంత్రించాలి .ట్రేసబిలిటి , సర్టిఫికేషన్ విధానం అమలు చేయాలి .అని చంద్రబాబు సూచించారు . మొత్తం 60 వేల మంది రైతులు ఉన్నారు . అందరూ సాగు నమోదు చేసుకోవాలి .అంతా అంగీరిస్తే రెండు మూడు నెలల్లో జియో ట్యాగింగ్ పూర్తి చేస్తాం .. రక్షణ రంగంలో ఆక్వా ఉత్పతుల్ని ప్రోత్సహిండంపై రక్షణ మంత్రి ని కోరుతాం ఆక్వా లాబ్స్ ఏర్పాటుకు కృషి చేస్తాం .విశాఖపణంలో క్వారంటైన్ ఏర్పాటు పైనా దృష్టి పెడతాం .మార్కెట్ లింకేజి , స్ధానిక మార్కెట్ కల్పిస్తాం ' అని పేర్కొన్నారు .