రైతులకు కొరకరాని 'రొయ్య'
జిల్లాలో ఆక్వా రైతులు ఏడాదికి రెండు నుంచి మూడు పంటలు పండిస్తున్నారు.70 శాతం వనామి ,30 శాతం టైగర్ రకాలు సాగు చేస్తున్నారు . సాగుదారుల నుంచి వ్యాపారులు రొయ్యలు కొనుగోలు చేసి జిల్లాలోని ప్రాసెసింగ్ ప్లాంట్ లతో పాటు ఉమ్మడి కృష్ణ ,పశ్చిమగోదావరి, ప్రకాశం , నెల్లూరు , జిల్లాల ప్రాసెసింగ్ ప్లాంట్లకు పంపిస్తున్నారు .ప్లాంట్లలో రొయ్యలను శుద్ధి చేసి శీతలీకరించి ఏసీ కంటైనర్లలో కృష్ణపట్నం , కాకినాడ , గంగవరం , చెన్నై పోర్టులకు తరలించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు . రైతులు పంపించే రొయ్యల్లో 95 శాతానికి పైగా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి . జిల్లా నుంచి అమెరికా , చైనా , దుబాయ్ , సౌదీ అరేబియా , కువైట్ , తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు .
విదేశాలకు ఎగుమతి అయ్యే రొయ్యల్లో సింహభాగం వాటా అమెరికాదే , అక్కడికి పెద్ద కౌంట్ ( 20,30,40) రొయ్యలు పంపిస్తున్నారు . చైనాకు వంద నుంచి 150 కౌంట్ వి ఎగుమతి అవుతున్నాయి .గత ప్రభుత్వ పాలన లో నాన్ ఆక్వా జోన్ పేరుతో కరెంటు రాయితీ ఎత్తేయడంతో మార్కెట్లో రొయ్యల ధరలు పడిపోయి సాగుదారులు బాగా నష్టపోయారు .వనామి కిలో 100 కౌంటర్ రొయ్య ధర రూ .160కు దిగజారింది . వైరస్లు ,వ్యాధులు విజృంభించి పంట నష్టం బాగా జరిగింది.నాణ్యమైన రొయ్య పిల్లలు లభించక ఎదుగుదల మందగించింది
కూటమి ప్రభుత్వ పాలనలో ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నా ఆక్వా రంగం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై విధించిన సుంకాల ప్రభావంతో కుదేలైంది . మార్కెట్ ఒక్కసారిగా రొయ్యల ధరలు పతనమయ్యాయి . ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్రంగా నష్టపోతామని బాపట్ల జిల్లా ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు . పలువురు పంట విరామం తీసుకునే ఆలోచనలో ఉండగా చాలామంది సాగు విస్తీర్ణం తగ్గించుకోవాలని చూస్తున్నారు .
.ఫిబ్రవరి చివరివారం నుంచి ఆక్వా సాగు కొత్త సీజన్ ప్రారంభమైంది . నాన్ ఆక్వా జోన్ రైతులకు రూ
.రూ1.50కే యూనిట్ కరెంట్ సరఫరా చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించి తీపి కబురు చెప్పింది
.రైతులు ఉత్సాహంగా రొయ్యల సాగు చేపట్టారు . ట్రంప్ అమెరికాకు ఎగుమతి అయ్యే భారత ఉత్పత్తులపై సుంకాలు విధించడంతో ఇప్పటివరకు ఆక్వా రంగంలో ఉన్న సానుకూల పరిస్థితులు తల్లకిందులయ్యాయి . ఒక్కసారిగా కిలో రొయ్యల ధర రూ .40 పడిపోయింది . మంద కౌంట్ ధర రూ
. 200 కు దిగజారింది . రొయ్య రైతులకు 100 కౌంట్ కిలో రొయ్యలు ఉత్పత్తికి రూ .230వరకు ఖర్చవుతుంది . ప్రస్తుత ధర కొనసాగితే కిలోకు రూ . 40 చొప్పున ఎకరాకు ఓ సీజన్కు రూ . 80 వేలు చొప్పున సాగుదారులు నష్టపోతారు . అదే పెద్ద కౌంట్ రొయ్యలకైతే నష్టం రూ . లక్షల్లో వస్తుంది . ఇప్పటికే రొయ్యల సాగు ప్రారంభించిన వారు తమ పరిస్థితి ఏంటని తీవ్ర ఆందోళన చెందుతున్నారు .
. జిల్లాలో ఆక్వా సాగు చేసే మండలాలు (09):రేపల్లె , నగరం , నిజాంపట్నం , పిట్టలవానిపాలెం,కర్లపాలెం , బాపట్ల , చీరాల , వేటపాలెం , చినగంజాం
. ఆక్వా సాగు విస్తీర్ణం :23 వేల ఎకరాలు
. జిల్లా నుంచి ఏటా విదేశాలకు ఎగుమతి అవుతున్న ఆక్వా ఉత్పత్తుల విలువ:రూ .872కోట్లు
. ఎగుమతుల్లో అమెరికా వాటా : 50 శాతం