A PHP Error was encountered

Severity: Warning

Message: fopen(/home/aquall999/public_html/system/cache/sessions/PHPSESSID68e3aae7eaf443b93fdeb94f49f3a936eb53fab3613fe3a31169a9f87a11b042): failed to open stream: Disk quota exceeded

Filename: drivers/Session_files_driver.php

Line Number: 156

Backtrace:

File: /home/aquall999/public_html/application/controllers/Home.php
Line: 16
Function: __construct

File: /home/aquall999/public_html/index.php
Line: 296
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: session_start(): Failed to read session data: user (path: /home/aquall999/public_html/system/cache/sessions)

Filename: Session/Session.php

Line Number: 140

Backtrace:

File: /home/aquall999/public_html/application/controllers/Home.php
Line: 16
Function: __construct

File: /home/aquall999/public_html/index.php
Line: 296
Function: require_once

Page:
  1. 1
  2. 2

ఆక్వా చెరువుల స్ధితిపై కనిపించని కాపలాదారు ఆటోమెషీన్ వ్యవస్ధ

  • రొయ్యల చెరువుకు సాంకేతిక గొడుగు
  • ఆక్వాచెరువుల స్ధితిపై సంక్షిప్త సందేశం
  • చంద్రన్న రైతు క్షేత్రంలో తొలిసారి ఏర్పాటు
  • రాష్ట్రంలో రొయ్యల సాగు విస్తీర్ణం: 7 లక్షల ఎకరాలు
  • రొయ్యల సాగు ద్వారా వార్షికాదాయం: రూ.65 వేల కోట్లు
  • రొయ్యల సాగు పై ఆధారపడిన వారు :10 లక్షలు
  • చంద్రన్న రైతుక్షేత్రం అమలు చేస్తున్న మండలం: యలమంచి

లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి అదృష్టాన్నే నమ్ముకునే రైతులకు రోజూ చెరువులోని పరిస్ధితులను తెలుసుకోవడం ఓ రకంగా జీవన్మరణ సమస్యే . పట్టుబడి పూర్తయ్యే వరకు ఎంత సరకు ఉందో తెలియని పరిస్ధితి. చెరువు లోపల తరచూ మారిపోయే వాతావరణ పరిస్ధితులే ఇందుకు కారణం . ఇటువంటి పరిస్ధితుల్లో చాలామంది ఆక్వా రైతులు ఆశించిన దిగుబడూలు లభించక రూ. లక్షల్లో నష్ట పోతున్నారు. ఇటువంటి ఇబ్బందులకు  చెక్ పెడుతూ కొత్తగా ఆటోమెషీన్  వ్యవస్ధ అందుబాటులోకి  వచ్చింది.రాష్ట్రంలోనే తొలిసారిగా పస్చిమ గోదావరి జిల్లా యలమంచి మండలం నార్నమెరకలో అమలుచేస్తున్న చంద్రన్న రైతు క్షేత్రం పధకంలో ఈ వ్యవస్ధను మత్స్యశాఖ ఏర్పాటు చేసింది.రొయ్యల చెరువుల చెంతనే ఆటోమెషీన్ వ్యవస్ధ అందుబాటూలో ఉంటే అన్నదాత నిశ్చింతగా ఉండొచ్చు .రొయ్యల చెరువులోఏ చిన్న తేడా వచ్చిన ఈ వ్యవస్ధ ద్వారా రైతుకు సంక్షిప్త  సందేశం అందుతుంది.స్ వాటర్ పారామీ ప్రోబ్స్ అనే పరికరం  ఉంటుంది దీనిలో సెన్సార్లు  , అంతర్జాలం ఆధారంగా పనిచేసే పరికరం ఉంటుంది. సౌర విద్యుత్తుతో ఉపగ్రహం అనుసంధానం  ద్వారా పనిచేసేలా రైతు చరవాణిని ఈ వ్యవస్ధకు అనుసంధానిస్తారు. చరవాణిలో ఆటోమెషీన్ సంబంధించిన యాప్ ను నిక్షిప్తం చేస్తారు. ఈ పరికరాన్ని సౌర ఫలకం ఉన్న స్తంభానికి అమర్చుతారు. ఈ విధంగా తయారైన ఆటోమెషీన్ ను రొయ్యల చెరువులోకి దించుతారు. ప్రోబ్ సంగం మాత్రమే మునిగేలా ఏర్పాటుచేస్తారు. దీనిలో ఉన్న రిసీవర్ల ద్వారా చెరువులోని  వాతావరణంలో ఆందోళనకరమైన మార్పులు సంభవిస్తే లోపాన్ని తెలియజేస్తూ సంబంధిత చరవాణికి వెంటనే సంక్షిప్త  సందేశం అందుతుంది. వివిధ ప్రాంతాల్లొ చెరువులు సాగుచేసే తనలాంటి రైతులకు ఆటోమెషీన్ వ్యవస్ధ బాగా ఉపయోగపడుతుందని నార్నిమెరకుకు చెందిన ఆదర్శ రైతు టి. హనుమప్రసాద్ అభిప్రాయపడారు.

రొయ్యల సాగులో నాలుగు స్తంభాలుగా పిలవబడే హైడ్రోజన్ గాఢత ,ఆక్సిజన్ స్ధాయి,అమోనియాలు సవ్యంగా ఉంటేసాగులోనూటికి నూరు శాతం విజయం సాధించవచ్చు వీటిలో ఏఒక్క దానిలో వ్యత్యాసం వచ్చినా సాగుకు ప్రమాదం వాటిల్లినట్టే . అందువల్ల ఈ నాలుగింటికి ప్రమాణాలు కచితంగా నిర్వహించాలి. చెరువులో వీటి పరిస్ధితి ఎలా ఉందో తెలుసుకోవాలంటేరౌతులు రోజూనెఐటి నమూనాలతో పరీక్షా కేంద్రాల చుట్టూ తిరగాల్సిందే. ఇదంతా జరిగేపనికాదు. అందువల్ల అకస్మాత్తుగా చెరువులో తేడా వస్తే రొయ్యలను పట్టాల్సిన పరిస్ధితి ఏర్పడుతుంది. ఈ నేపధ్యంలోఅన్నదాతకుకనిపించని కాపలాదారుగా ఆటోమెషీన్ వ్యవస్ధ అందుబాటులోకి వచ్చింది.దీని వల్ల  ఇంటి నుంచే చెరువును పర్యవేక్షించవచ్చని యలమంచి మత్య్సశాఖ  అధికారి ఎల్.ఎన్.రాజు చెప్పారు.

ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తన్న ఆటోమెషీన్ ధర రూ. 60 వేల వరకు ఉంది. మత్స్య శాఖ 50  శాతం రాయితీ కల్పిస్తుంది. తొలిసారిగా చంద్రన్న రైతు క్షేత్రంలో దీన్ని పరిచయం చేశాంఇతర రైతులకూ రాయితీ పై అందించడానికిప్రణాళీక రూపోందిస్తున్నాం. అందుబాటులొకి వచ్చిన సాంకేతికతను ఉంపయోగించుకుని శాస్ర్తీయ పధ్దతిలో రొయ్యలసాగుకు రైతులుసమాయత్తమవ్వాలి.

Source: ennadu