Page:
  1. 1
  2. 2

చేపల ఉత్పత్తిలో 10 .72 శాతం వృద్ధి

 అమరావతి : గత ఆర్ధిక సంవత్సరం (2021 -22 )లో రాష్ట్రంలో చేపల ఉత్పత్తిలో 10 .72 శాతం వృద్ధి నమోదైంది .2021 -22  లో 4623299 టన్నుల చేపలు ఉత్పత్తి అయినట్లు మత్స్యశాఖ గణాంకాలు స్పష్టం చేశాయి .స్ధిర ధరల ఆధారంగా చూస్తే ఈ ఉత్పత్తి విలువ రూ .55 ,294 కోట్లు 2019 - 20 తో పోలిస్తే 2021 -22 లో చేపల ఉత్పత్తి 4 .48 లక్షల టన్నులు పెరిగింది .2021 -22  ల సముద్ర చేపలతో పాటూ సముద్ర రొయ్యలు , ఉప్పునీటి , మంచి నీటి రొయ్యల ఉత్పత్తి కూడా పెరిగింది .చేపల ఉత్పత్తి పెంచడానికి , ప్రధానంగా మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు రాష్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది నీటి వనరులున్న చోట చేపల ఉత్పత్తికి ప్రభుత్వం అవకాశాలు కల్పించడంతో పాటు మత్స్యకారులకు అవసరమైన మౌలిక వసతులను కూడా కల్పిస్తోంది కొత్తగా తొమ్మిది ఫిషింగ్ హార్బలు నిర్మాణం చేపట్టింది గత ఆర్ధిక సంవత్సరంలో దేశం మొత్తం చేపల ఎగుమతుల్లో మన రాష్ట్ర వాటా 38 శాతం .ఎగుమతులతో పాటు వీలనంత మేర స్ధానికంగా చేపల వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది .
source : sakshi