Page:
  1. 1
  2. 2

రోగాల రొయ్య.. కొరకరాని కొయ్య

రెండెకెల వృద్దిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆక్వాసాహును ప్రోత్సహిసున్నా.. ధరల పతనం, వ్యాధుల విజృంభణ కారఁఅంగా రైతులు కుదేలవుతున్నారు. ప్రస్తుత్తం వ్యాపారుల కూటమి కారణంగా రొయ్య రైతుకు గిట్టుబాటు ధర దక్కడమ్లేదు. మరో పక్క నకీలి సీడ్ కారణంగా వ్యాధులు చుట్టుముడుతున్నాయి. దీంతో రైతులు పంట కాలం మధ్యలోనే చెరువులు ఖాళీ చేస్తున్నారు. జిల్లాలోని కోస్తా తీరప్రాంత మండలాల్లో స్ నాలుగు వేల మంది రైతులుసుమారు 20 వేల ఎకరాల్లో ఆక్వాసాగు చేస్తున్నారు. రెండెల్ల క్రితం వాతావరణం అనూకూలించడంతో  పాటు ధరలు ఆశాజనకంగా ఉండటంతో రియ్య రైతుకు లాబాలు కూడా వచ్చాయి. దీంతో కొత్త రైతులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ ఏడాది పెద్ద ఎత్తున ముందుకు  వచ్చారు. పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి,కృష్టా , నెల్లూరు జిల్లాలో సాగుతో పాటూ , దిగుబడులు పెరిగాయి. ఇదే అదునుగా డిమాండ్  లేదంటూ వ్యాపారులు ధరలు తగ్గించేశారు.
విజృంభిస్తున్న తెల్ల మచ్చ; జిల్లాలో 28 హేచరీలు ఉన్నాయి.కోస్టల్ ఆక్వాకల్చర్ ఆధారిటీ అనుమతితో రొయ్య పిల్లల ఉత్పత్తి నిమిత్తం ఇతర దేశాల నుంచి తల్లి రొయ్యలు  ను దిగుమతి చేసుకుంటారు. ఒక క్యూబికల్ ధర రూ.30 లక్షల చొప్పున పలుకుతుంది. హేచరిల్లో తల్లిరొయ్యలనుంచి 7 సార్లు వరకు రొయ్యపిల్లలనుఉత్పత్తి చెయవచ్చు.బ్రూడర్స్ ధర ఎక్కువగా ఉండటంతో నిబంధనలను మించి అయినా కొందరు హేచరీల నిర్వాహకులు 15 సార్లు ఉత్పత్తి చేస్తున్నారు. అవి నాణ్యత లేని సీడ్ కావడం కారనంగా రోగ నిరోధక శక్తి తక్కువగాఉంటుంది. ముందుగా సీడ్ కొనుగోలుచేసేందుకుపెట్టుబడి పెట్టలేనిరైతులను ఆసరా చేసుకుని నమ్మకంగా నాణ్యత లేని సీడ్ను అంటగడుతున్నారు. చెరువుల్లో  పిల్లలను వదలడం , చెరువుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది.  నివారణకు ముందు లేకపోవడంతో వచ్చిన రెండు , మూడురోజుల్లోనే చెరువులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఈ నేపధ్యంలో 100, 80 కౌంటు దశలోనే రొయ్యలనుపత్తాల్సిన పరిస్ధితీ  నెలకొంది.
అనుకూలించని వాతావరణం : రొయ్యల సాగుకు పొడి వాతావరణం పూర్తిగా రొయ్యల సాగుకు ప్రతికూలంగా మారింది. సాధారణంగా చెరువుల్లో రొయ్యల సాగుకు ఉప్పునీటిశాతం 20 నుంచి 25 వరకు అనుకూలంగా ఉంటుంది . వర్షాభావ పరిస్ధితుల నేపధ్యంలో ప్రస్తుత్తం  ఉప్పునీటి శాతం 38 నుంచి 45 వరకు ఉంది.
పడిపోయిన ధరలు 
మార్కెటింగ్ అంతా ప్రవేటు వ్యక్తులు, కంపెనీల చేతుల్లోనే ఉంది. అంతర్జాతీయంగా ధరల్లో ఏ మార్పు లేకన్నా స్ధానికంగా మాత్రం ధరలు తగ్గాయి. జిల్లా రైతులు ఎక్కువ శాతం మంది భీమవరం , నెల్లూరు, మార్కెట్ కు విక్రయిస్తారు. రొయ్యలను కొనుగోలు చేసే కంపెనీ వ్యాపారులు కూటమి కట్టారు. దీంతో ధరలు గత మూడు నెలలగా పరిశీలిస్తే సరాసరి కిలో రూ. 100 చొప్పున పడిపోయాయి.ప్రస్తుత్తం రొయ్యలకు ధరలు లేకపోవడం నష్టాల శాతం పెరిగింది. ఎకరానికి సాగు ఖర్చు రూ. 5 నుంచి రూ. 7 లక్షల వరకు అవుతుంది.ప్రస్తుత్తం 100 లేదా 80 కౌంటు లోనే రొయ్య పంటను తీయడంతో రూ.3 నుంచిరూ4 లక్షలు మాత్రమే చేతికి వస్తుంది. దీంతో ఎకరానికి రూ. 2 నుంచి రూ. 3 లక్షల వరకు నష్టపోవాల్సి వస్తుంది . ఈ నేపధ్యంలో రైతులు రొయ్య సాగు అంటేనే భయపడుతున్నారు.
Source: eenadu