Page:
  1. 1
  2. 2

ఆక్వా సాగుపై శాటిలైట్ సర్వే

రాష్ట్రంలో ఆక్వా సాగుకు సంబంధించిన సమస్త సమాచారాన్ని సేకరించడానికి ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది.సముద్ర ఎగుమతుల అభివృద్ధి సంస్ధ ఇటీవల శాటిలైట్ ద్వారా కొంత సమాచారం సేకరించింది. దానిని  వాస్తవ రికార్డులతో  పోల్చి చూసినప్పుడు ఎంతో వ్యత్యాసం కనిపించింది. ఉదాహరణకు రాష్ట్రంలోనే అత్యధికంగా ఆక్వాసాగు జరుపుతున్న పశ్చిమగోదావరి జిల్లాలో ఎంపెడా వద్ద ఉన్న లెక్కల ప్రకారం 10,586 హెక్టార్లలో  ఆక్వాసాగు జరుగుతుండగా శాటిలైట్ ద్వారాఅందినసమాచారంలో 84, 832 హెక్టార్లలో సాగు చేస్తున్నట్లు తెలిసింది. కృష్టా జిల్లాలో  దస్త్రాల ప్రకారం 11 వేల హెక్టార్ల కాగా, శాటిలైట్ సమాచారంలో 56 వేల హేక్టార్లగా ఉంది. శాటిలైట్సమాచారం ప్రకారం కోస్తాజిల్లాలో 2,51,880 హెక్టార్లలో ఈ సాగు విస్తరించి ఉన్నట్టు తేలింది.అందుకే ఇప్పుడు జిల్లాల వారీగా సూక్ష్మ స్ధాయిలో సాగు విస్తీర్ణం వివరాలను సేకరించి వాటిని శాటిలైట్ కు అనుసంధానం చేయాలని భావించి పని మొదలు పెట్టారు. వారం రోజుల క్రితమే ఈ ప్రక్రియ కృష్టా జిల్లలో ప్రారంభిచారు.దీనికోసం ఎంపెడా, మత్య్సశాఖలు సంయుక్తంగా పనిచేసతున్నాయి. ఒక్కో బృందానికి 10 చొప్పున గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంస్ సమకూర్చారు. క్షేత్ర స్ధాయికి వెళ్ళే బృంద సభ్యులు సంబంధిత పొలం వద్ద నిల్చొని దక్షిణ –ఉత్తర రేఖాంశాల ఆధారంగా వివరాలను జీపి ఎస్ యంత్రంలో నమోదు చేస్తారు. ప్రతి రైతుకు ఫార్మ గుర్తింపుసంఖ్యను ఇస్తారు. ఇది ఒక రకంగా ఆధార్ సంఖ్య లాంటిది. దాన్ని కూడా శాటిలైట్లో పొందుపరుస్తారు.. పశ్చిమగోదావరి జిల్లాలో ఏప్రాంతంలో బృందాలు ఎప్పుడు పర్యటిస్తాయనే విషయాన్ని ఆయా ప్రాంతాల్లో ఒక రోజుముందుగాసమాచారం ఇస్తామని ఎంపెడా భీమవరం ఏడీ శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయడానికి సుమారు 4 నెలలు పడుతుందన్నారు.
Source: eenadu