Page:
  1. 1
  2. 2

వనామీకి బయో షాక్

అంతా అనుకున్నట్లే జరిగింది.. వెనామి ద్వారా లాభాలు అర్జించాలన్న రైతుల అత్యాశ చివరకు ఆరంగాన్నే ప్రశ్నార్ధకంగా మార్చే పరిస్ధితి కల్పిస్తోంది. వనామీ కి వైట్ స్పాట్ వంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు రైతులు విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్ వాడటంతో ఎగుమతులపై త్రీవ ప్రభావాన్ని చూపింది. అది ఏ స్ధాయికిచేరుకుందంటే భారతదేశం నుంచి యూరోపియన్ యూనియన్ , అమోరికా , లాటిన్ అమెరిక, జపాన్ వంటి  దేశాలకు వెనామీ ఎక్కువగా ఎగుమతి చేస్తుంటారు. యూరోపియన్  కమిషన్ నిషేధించిన యాంటీబయోటిక్స్ భారతదేశం నుంచి ఎగుమతుల్లోకనిపించడంతో వెంటనే వాటిని వెనక్కు పంపిచి వేసింది. ఈ ఎగుమతుల్లో జిల్లాకు చెందిన నాలుగు చెరువులకు సంబంధించినవి ఉండటంతో ఇక్కడి మత్స్యశాఖ సహాయ సంచాలకుడు లాల్  మహ్మద్  వెంటనే అప్రమత్తమయ్యారు. జిల్లా చరిత్రలోనే తొలిసారిగా నాలుగు చెరువుల లైసెన్స్ లు రద్ధు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. నిషేధిత యాంటీబయోటిక్స్ ఎవరైనా తమ చెరువుల్లో వినియోగిస్తే ఆ చెరువులను కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు.
కలకలం: వెనామీలో నిషేధిత యాంటీబయోటిక్స్  ఉండి వాటిఎగుమతులనువెనక్కుపంపించడంతో జిల్లాలోని ఆక్వారైతుల్లో కలకలం మొదలైంది. ఆక్వా రంగం ప్రారంభ దశలో అప్పటి రైతులు చెరువులను తవ్వించి లాభాలనుఅర్జించారు.  ఆసమయంలో అది డాలర్ల పంటగా ముద్రపడింది. ఒక రైతును చూసి మరో రైతు పంట పోలాలను సైతం ఆక్వాచెరువులుగా మార్చేశారు. దాంతో యాంటీబయోటిక్స్ వాడటంతో ఆ సమయంలో ఎగుమతులపై త్రీవ ప్రభావాన్ని చూపించింది. వైట్ స్పాట్ వంటి వ్యాధులు సోకి చెరువులన్నీతుడిచి పెట్టుకొనేలా చేసింది. కొన్నేళ్ళ పాటు ఆక్వా చెరువులంటేనే భయపడే పరిస్ధితులు నెలకొన్నాయి. వెనామీ రాకతో ఆక్వా రైతులకు తిరిగి ఊపిరిపోసినట్లయింది. ఈరకానికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉండటం   , వాతవరణ పరిస్ధితులకు తగ్గట్టుగా అది సాగవుతుండటంతో రైతులు తిరిగి సాగు చేపట్టారు. ప్రస్తుత్తం జిల్లాలో 7 వేల హెక్టార్లలో ఆక్వా చెరువులున్నాయి. దాదాపు 3,600 మంది రైతులు  చెరువులనుసాగుచేస్తున్నారు. ప్రస్తుత్తం వెనామి 80 శాతం సాగులో ఉంది . పరిస్ధితులన్ని అనూకూలిస్తే ఒక్కో హెక్టారుకు 5టన్నుల వరకు దిగుబడులు వస్తాయి. మరికొన్ని రోజుల్లో వెనామిని విక్రయించేందుకు రైతులు సిద్దమవుతున్న  తరుణంలో యూరోపియన్  కమిషన్ నిషేధించిన యాంటీబయోటిక్స్ దేశం నుంచి ఎగుమతి అయిన వాటిలో ఉండటం,వాటిలో కూడా జిల్లాకు చెందిన రెండు చెరువుల ఉండటంతో ఇక్కడి ఆక్వా రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
బయటపడిందిలా : వెనామి సాగులో 20 రకాల యాంటీబయోటిక్స్ నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 11 వ తేదీన జీఓ నెం 2 జారీ చేసింది . అయితే జిల్లాలోని టంగుటూరుమండలలో  వెలగపూడిలో రెండు  చెరువులు, అనంతవరంలో రెండు చెరువులు నిషేధించిన యాంటీబయోటిక్స్  ఉన్నట్లు చెన్నైలోని ఎంపెడా లాబోరేటరీలో నిర్ధారించారు. ఈ నాలుగు చెరువుల్లో నైట్రో ప్యూరాన్ 0.8 పీపీఎం వాడినట్లు ఎలీసా పరీక్షలో తేలింది. నిషేధిత యాంటీబయోటిక్స్ వాడినట్లు తేలడంతో ఆ చెరువు లైసెన్స్ లు రద్దు చేయాలని చెన్నై లోని వాణిజ్య మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్నఎక్స్ పోర్ట్ ఇన్ స్పెక్షన్ ఏజెన్సీ జిల్లాకు చెందీన మత్య్సశాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతోయుద్ధ ప్రాతిపదికన వాటి లైసెన్స్ రద్దు చేశారు.