Page:
  1. 1
  2. 2

యాంటీబయోటిక్స్ విషయంలో జాగ్రత్త

ఆక్వా రైతులు యాంటీబయోటిక్స్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఎంపెడా జాయింట్ డైరక్టర్ సంపత్ కుమార్ సూచించారు. ఆక్వా ప్రొఫెషనల్ వెల్పేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో భీమవరంలోని ఆనంద్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఆక్వా రైతులకు రాష్ట్ర స్దాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన సంపత్ కుమార్ మాట్లాడుతూ గతంలో యాంటీబయోటిక్స్  అవశేషాలు ఉన్నాయంటూ వివిధ దేశాలు 70 కంటైనర్ల రొయ్యలను  వెనక్కి పంపేశాయని అన్నారు. దాని వల్ల ఎగుమతి దారులు , రైతులు భారీగా నష్టపోయారని గుర్తుచేశారు. ఉండి కృషి విజ్ఞాన కేంద్రం  శాస్త్రవేత్త సుగుణ మాట్లాడుతూ త్వరలో కేవీకేలో  రూ.8 కోట్లతో ఆక్వా పరిశోధన కేంద్రం ,ఏర్పాటు చేస్తున్నామని,దీనిలో రూ. 4.50 కోట్ల విలువైన పరిశోధన పరికరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేంద్రం వల్ల ఆక్వారైతులకు ఎంతో విలువైన సేవలు అందుతాయని అన్నారు. ఆనంద్ గ్రూప్ చైర్మన్ ఉద్దరాజు కాశీవిశ్వనాధరాజు , ఆక్వా ప్రొఫెషన్  వెల్ఫేర్  అసోషియేషన్ అధ్యక్షుడు అమరనేని శ్రీనివాస్, కోశాధికారి ఎస్. రాజారామం, ఆక్వా శాస్త్రవేత్తలు రవికుమార్ , కురియన్ ,డాక్టర్ రాయప్రోలు శ్రీనివాస్  ,జుంగాదాస్ తదితరులు ఆక్వా రంగంలో వస్తున్న మార్పులు  తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. అనంతరం ఉత్తమ ఆక్వారైతుగా ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్న రైతుకొత్తపల్లి బలరామరాజుని సత్కరించారు. సదస్సులోఉభయ గోదావరి, కృష్టా జిల్లాలకు చెందిన ఆక్వారైతులు పాల్గోన్నారు.
Source: eenadu