Page:
  1. 1
  2. 2

చేపల ఉత్పత్తిలో భారత్ కు రెండో స్ధానం

సముద్ర చేపలు, ఆక్వా రంగ ఉత్పత్తుల్లో మన దేశం ప్రపంచంలో రెండో స్ధానంలో ఉందని భారతీయ మత్స్య పరిశోధన కేంద్రం డైరెక్టర్ జనరల్ మహేష్ కుమార్ ఫెరీజియా చెప్పారు.గురువారం విశాఖ బీచ్ రోడ్డులో మత్స్యపరిశోధనకేంద్రం ఆవరణంలో సముద్ర ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించారు. అంతర్జాతీయ విపణిలో దేశీయ మత్స్య పరిశ్రమ వేగంగా పురోగమిస్తుందని చెప్పారు. దేశంలో 1950-51 లో చేపల ఉత్పత్తి 7.5 లక్షల టన్నులుంటే 2015-2016 నాటికి అది 107.95 లక్షల టన్నులకు చేరుకుందన్నారు. భారత సముద్ర జలాల్లో సుమారు 4.412 మిలియన్ మెట్రిక్ టన్నుల చేపల దిగుబడి  లభిస్తుందని అంచనా వేసినట్లు చెప్పారు. సాగర జలాలు కలుషితమవుతుడడంతో మత్స్య సంపద తగ్గిపోతుందని మహేశ్ కుమారు చెప్పారు. చైనాలో ఒక కిలో చేపల వేటకు ఒకకిలో బొగ్గుపులుసు వాయువు విడుదల అవుతుందని మన దేశంలో 1.4 కిలోల నుంచి 2 కిలోల బొగ్గుపులుసు వాయువు బయటకు వస్తుందని ఆయన వివరించారు. ప్రభుత్వాలు కాలుష్యాన్ని నివారించే చర్యలను తీసుకొవాలన్నారు. సముద్ర వాణిజ్య విభాగపు ఉప డైరెక్టర్ జనరల్ జయంత్ ముఖోపాధ్యాయ పాల్గోన్నారు.
Source : eenadu