Page:
  1. 1
  2. 2

ఆక్వా రైతులకు శుభవార్త (చెరువుల వద్దనే వ్యాధి నిర్ధారణ)

జిల్లాలోని ఆక్వా రైతులకు మత్స్యశాఖ శుభవార్త వినిపించింది. ప్రైవేట్ కంపెనీల దోపీడి బారిన రైతులు పడకుండా మత్స్యశాఖ అడ్డుకట్ట వేయనుంది. ఆక్వా చేరువుల్లో నీరు మట్టీ గుణాలు మొదలుకుని  రొయ్యలకు మేత ఏ విధంగా  వేయాలో తెలియజెప్పేందుకు వ్యాధుల నిర్ధారణ సంచార ప్రయోగశాలను మత్స్యశాఖ సిద్ధం చేసింది. నేరుగా ఆక్వాచెరువుల వద్దకే సంచార ప్రయోగశాల చేరుకుని రైతులకు సలహాలు సూచనలు అందజేసి అధిక ఉత్పత్తి సాధించేందుకు కృష్టి చేయనుంది. ఇప్పటికే రాష్ట్రంలోని తూర్పుగోదావరి , పశ్చిమ గోదావరి, కృష్టా జిల్లాల్లో వ్యాధుల నిర్ధారణ సంచార ప్రయోగశాలలనుప్రారంభించి అక్కడి రైతులు సత్పలితాలు సాధించేందుకు మత్స్యశాఖ దోహదపడుతోంది. తాజాగా ఈప్రయోగశాలను జిల్లాకు కూడా కేటాయించడంతో శుక్రవారం నుంచి సేవలు అందుబాటులోకి వచ్చాయి. మత్స్యశాఖ అసిస్టెంట్ డైరక్టర్ షేక్ లాల్ మహ్మద్ స్వయంగా టంగుటూరు మండలంలోని అనంతవరం , వెలగపూడి,రాయవరం గ్రామాల్లో గల ఆక్వా చెరువుల వద్దకు వ్యాధుల నిర్ధారణ పరీక్షలకు శ్రీకారం చుట్టారు.
ప్రైవేట్ కంపెనీల దోపిడీకి బ్రేక్....
రొయ్యలు, చేపల వ్యాధుల నిర్ధారణ సంచార ప్రయోగశాల ప్రైవేట్ కంపెనీల దోపిడీకి బ్రేకులు వేయనుంది. ఆక్వా రైతులకు ప్రైవేట్ కంపెనీలు బలవంతంగా తమ మందులను అంటగడుతూ వచ్చాయి. ప్రైవేట్ కంపెనీలకు చెందిన టెక్నీషియన్లు చెరువుల్లో వాస్తవ పరిస్ధితులను తెలుసుకోకుండానే పైపైన నాలుగైదు రకాల హెచ్చరికలు చేస్తూ తమ కంపెనీ మందులు వాడకుంటే మొత్తంగా నష్టపోతారంటు రైతులను తమ దారిలొకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. అదే సమయంలో తమ సూచనలు పాటించకపోవడంతో ఎప్పుడో దెబ్బతిన్న చెరువుల గురించి తెలియజేస్తూ ఆక్వారైతులను మరింత భయపెడతారు. తమ కంపెనీల మందులు వాడకుంటే లక్షలాది రూపాయల పెట్టుబడులు నీళ్ళ పాలవుతాయని చెప్పి అవసరం ఉన్నా... లేకున్నా వారికంపెనీ మందులు అంటగడుతూ రైతులను మరింతగా దోచుకోవడం పరిపాటీగా మారింది. ఇలాంటి పరిస్ధితుల్లో సంచార ప్రయోగశాల ఆక్వారైతులకు వరమనే చెప్పవచ్చు.
200 నుంచి 300 మంది రైతులతో ఒక క్లస్టర్..
ఆక్వా చెరువులు ఉన్న మండలాల్లో 200 నుంచి 300 మంది రైతులతో ఒక క్లస్టర్ ఏర్పాటు చేయనున్నారు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఒక కమిటీని నియమించనున్నారు. కమిటీలోని వారందరినీ సంఘటితం చేస్తూ ఆక్వాసాగును మరిత పెంచేందుకు జిల్లా మత్స్యశాఖ చర్యలు చేపట్టింది. క్లస్టర్ వారీగా రైతులను ఒక చోటుకు చేర్చి ఎల్ ఈడీ ప్రొజెక్టర్ ద్వారా స్క్రీన్ ఏర్పాటు చేసి ఉత్తమ యాజమాన్య పద్ధ్తులను కూడా వివరించనుంది. ఆక్వాకు సంబంధిత అధికారులు అక్కడిక్కడే నివృత్తి చేయనున్నారు. జిల్లలో 7వేల హెక్టార్లలోఆక్వా చెరువులు ఉంటే , ప్రస్తుతం 5 వేల హెక్టార్లలో వెన్నామీ సాగు చేసేందుకు రైతులు సిద్దంగా ఉన్నారు. మిగిలిన చెరువుల్లో కూడా సాగు చేపట్టేందుకు మత్స్యశాఖ అధికారులు చర్యలుచేపట్టారు.


soure : sakshi