Page:
  1. 1
  2. 2

పంజరాలలో 'కోబియా' చేపల పెంపకం

నెల్లూరు జిల్లా మత్స్య సంపద ఎగుమతుల కేంద్రంగా మారనుంది . కృష్టపట్నం , చైన్నై ఓడరేవులు సమీపంలో ఉండటంతో విదేశీ ఎగుమతులే లక్ష్యంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. చెరువులు , రిజర్వాయర్లలో చేపల పెంపకంతో పాటు జిల్లాను ఆనుకుని 169కి.మీల తీర ప్రాంతం వెంబడి చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిది. ఇందులో భాగంగా రాష్ట్రంలో నే మొదటి సారిగా పంజరాల ద్వారా చేపల పెంపకంపై  దృష్టి సారించిది. ఇది విజయవంతమైతే .. మత్స్యకార సంఘాల ద్వారా ఈ విధానంలో రాష్ట్రంలోని 8 తీర ప్రాంత జిల్లాల్లో చేపల పెంపకాన్ని  ప్రోత్సహించే విధంగా ప్రత్యేక పధకాన్ని అందుబాటులోనికి తీసుకురానున్నారు.
ప్రయోగం ప్రారంభం : నెల్లూరు జిల్లాలో 2016-17 ఆర్ధిక సంవత్సరంలో 2.78 లక్షల మెట్రిక్ టన్నుల మత్స్య సంపదను సాదించాలని లక్ష్యంగానిర్ధేశించుకున్నారు.దీని కోసం జిల్లాలోని 419 చెరువులు , ఏడు రిజర్వాయర్లలో 1.20 లక్షల హెక్టార్లలో చేపల పెంపకం చేపట్టారు.దీంతో పాటు ప్రయోగాత్మకంగా నెల్లురు జిల్లాలోని వాకాడు మండలం తూపిరిపాలెం దగ్గర పంజరంలో కోబియారకం చేపల పెంపకాన్ని ప్రారభించారు. దీనికోసం ప్రత్యేకంగా ప్లాస్టిక్ పైపులతో తయారు చేసిన పంజరాలను  ఏర్పాటు చేశారు. జపాన్, సింగపూర్ , చైనా, మలేషియా వంటి దేశాల్లో ఈ చేపలకు డిమాండ్ ఉంది.
విదేశాలకు ఎగుమతులు: కోబియా చేపల పెంపకం కోసం తీర ప్రాంతం  నుంచి సుమారు 20 కి.మీల లోపల సముద్రంలో రెండు పంజరాలను ఏర్పాటు చేశారు.ఒక్కో పంజరంలో 1500 కోబియా చేప పిల్లలను గత జూన్ నెలలో వదిలారు.ఇందుకోసం చెన్నైలోని జాతియ సముద్ర పరిశోధనా సంస్ధ నుంచి రూ. 72 లక్షల , జిల్లా అభివృద్ధి నిధుల నుంచిరూ. 1.12 లక్షల కోట్లను వుడుదల చేశారు. ఫిబ్రవరిరిలో చేపల ఎగుమతి లక్ష్యంగా  కసరత్తు చేస్తున్నారు. ప్రతిరోజూ మూడుసార్లు వాటికి ఆహారాన్ని అందించారు. ప్రస్తుతం ఒక్కో చేప 3 కిలోలబరువు వరకు వచ్చిదని అధికారులు తెలిపారు. దీని ప్రకారం ఒక్కో పంజరంలో సుమారు 6మెట్రిక్ టన్నులచేపల్ సంపద వస్తుందని  అంచనా.
కిలోకు రూ. 325 వరకూ:మలేషియా , సింగపూర్ , జపాన్ , ధాయిలాండ్ , చైనా వంటి దేశాలకు  వీటిని ఎగుమతి చేయటానికిమత్స్యశాఖ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో కోబియా చేపకు కిలోకు రూ. 325 వంతున ధర లభింస్తుందని అధికారులు తెలిపారు. దశల వారీగా మత్స్యకార  సహకార సంఘాలకు సముద్రంలోచేపల పెంపకాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం కొత్త పధకాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉందని అధికారులు తెలిపారు.
Source: eenadu