Page:
  1. 1
  2. 2

ఐదు ఆక్వాకల్చర్ జోన్లులతో ప్రకాశం జిల్లా

జిల్లాలో ఐదు ఆక్వాజోన్లు ఉన్నాయని వీటి వల్ల గత ఏడాది రైతులకు రూ.1280 కోట్లు ఆదాయ వచ్చిందని పేర్కొన్నారు.7500 హెక్టార్లలో ఆరు వేల మంది రైతులు  ఆక్వాజోన్లద్వారా చేపలు,రొయ్యల పెంపకాలు చేపట్టి మార్కెటింగ్ చేస్తున్నట్లు చెప్పారు.
ఈ ఏడాది 1850 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.చేపలు,రొయ్యల పెంపకాలు ఒకేచోట కేంద్రీకరించకుండా ఆ రైతులకు రోడ్లు ,విద్యుత్ రవాణా వంటి మౌలిక సదుపాయాలు కల్పించడమే ఆక్వా జోన్ల లక్ష్యమన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన జోన్ లలో మాత్రమే  రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. జిల్లాలొ ఆక్వా జోన్లలోఒకటో జోన్ కింద చీరాల , వేటపాలెం, చిన్న గంజాం,రెండో జోన్ కింద ఎన్ జీ పాడూ ,ఒంగోలు,కొత్తపట్నం, మూడో జోన్ కింద టంగుటూరు, సింగరాయకొండ, నాలుగో జోన్ కింద ఉలవపాడు,గుడ్లూరు, ఐదో జోన్ కింద అద్దంకి , దర్శి, ముండ్లమూరు, కురిచేడు మండలాలు ఉన్నాయని ఎఫ్ డీఓ వెంకటేశ్వరరేడ్డి వివరించారు.