Page:
  1. 1
  2. 2

వెనామీ పై వైట్ దాడి

జిల్లాలో 6500 హెక్టార్లలో ఆక్వా చెరువులు ఉన్నాయి. 60 నుంచి 70 శాతం వెనామీ క్రాఫ్ చివరి దశకు చేరుకుంది. ఈ సమయంలో వెనామీ పై వైట్ దాడి చేస్తుండటంతో రైతులు త్రీవంగా నష్టపోయే ప్రమాదం  నెలకొంది. జిల్లాలో గత రెండు నెలల వ్యవధిలో సరైన వర్షాలు లేకపోవడంతో కూడా వెనామీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సెలనీటి నీళ్లల్లో  ఉక్కదనం పెరిగిపోవడం, ఉష్టోగ్రతలో పది డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటుండంతోవెనామీ రొయ్యల్లో పెరుగుదల మందగిస్తోంది.
వైట్ స్పాట్:
     వెనామీ రొయ్యలకు వైట్ స్పాట్ సోకడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 1994 తొలిసారిగా టైగర్ రకం రొయ్యలకు వైట్ స్పాట్ సోకడంతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతకుముందు వరకు డాలర్ల పంటగా పేరు గడించిన ఈ సాగు ఒక్క సారిగా కుదేలైంది. చివరకు  మరుసటి ఏడాది ఏకంగా క్రాఫ్ హాలిడే కూడా ప్రకటించారంటే ఎగుమతులపై ఏవిధంగా ప్రభావం చూపిందో అర్ధం చేసుకోవచ్చు. ఏడాది తరువాత తిరిగి రొయ్యల సాగు ప్రారంభించినా ఆశించిన ఫలితాలు రాలేదు .  వైట్ స్పాట్ వైరస్ కు చికిత్స లేకపోవడంతో  రైతులు సాగు చేయాలంటే భయపడాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి.అంతకు ముందు జిల్లాలోని తీర ప్రాంతాల్లో ఇబ్బడి ముబ్బడిగా తవ్విన రొయ్యల  చెరువులను రైతులు కొన్నేళ్ల పాటు అలాగే వదిలేశారు. ఈ నేపధ్యంలో 2009 లో వెనామీ సాగుకు రైతులు సంసిద్ధులైనారు. ఈ సాగు ప్రారంభ దశలో మంచి ఆదాయం రావడంతో  రైతులు విచ్చలవిడిగా చెరువులు తవ్వి సాగు చేపట్టారు. నాణ్యమైనవిత్తన కొరత , వాతావరణ కాలుష్యం, నీటి నాణ్యాతా ప్రమాణాలు సరిగా పాటించకపోవడం, అధిక సాంద్రతలో సాగు చేపట్టడం ,  విచక్షణా రహితంగా రసాయనాలు వాడటం , నాసిరకం మందులు విరివిగా వాడటంతో  వెనామీ కూడా సంక్షోభంలోకి నెట్టి వేయబడింది.
వైట్ గట్:
     వెనామీకి వైట్ గట్ రూపంలో మరో ఉపద్రం ముంచుకొచ్చింది. రైతులు సరైన నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవడతో వాటికి వైట్ గట్  వ్యాధి సోకుతుంది. సాధారణంగా 60 రోజుల తరువాత కనిపిస్తోంది. వైట్ గట్ వచ్చిన రొయ్యలు ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా చనిపోతాయి. రొయ్య యొక్క కాలేయ క్లోమం , ఆహార నాళంలో జలగలవంటి గ్రిగరెన్స్  , నీలి ఆకుపచ్చ శైవలాలు, విబ్రియో బ్యాక్టీరియా, ఈహెచ్ పీ వంటి వ్యాధికారక జీవుల వల్ల వైట్ గట్ వ్యాప్తి స్తోంది. వైట్ గట్  వచ్చిన రొయ్యలకు ఆహార నాళం తెల్లగా మారుతోంది. రొయ్యల మేత కూడా సరిగా తీసుకోకపోవడంతో  పెరుగుదల  మందగిస్తోంది. వైట్ గట్ ను రైతులు సకాలంలో గుర్తించకపోవడం వల్ల ఎక్కువ సంఖ్యలో రొయ్య పిల్లలు దీని బారినపడుతున్నాయి.రొయ్య సీడ్ కు సంబంధించిన సరైన నాణ్యత లేకపోవడం కూడా దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
సరైన యాజమాన్య పధ్ధతులు పాటించాలి
వెనామీ రొయ్య సాగు చేస్తున్న రైతులు సరైన యాజమాన్య పధ్ధతులు పాటించాలి . సరైన యాజమాన్య పధ్ధతులు అవలంభించడం ద్వారా ఒక్కో రొయ్య సరాసరి వారానికి ఒకటిన్నర గ్రాము నుంచి రెండు గ్రాముల వరకు పెరుగుతాయి. రొయ్యల పెరుగుదల్లో మార్పు కనిపించకుంటే వెంటనే యాజమాన్య  పద్ధతులపై ప్రత్యేక దృష్టి సారించాలి.
Source: sakshi