Page:
  1. 1
  2. 2

మత్స్యరంగ అభివృద్ధికి ఉత్తర్వులు విడుదల

మత్స్యరంగ అభివృద్ధికి కేంద్రం నీలి విప్లవం పేరుతో పధకం రూపొందించగా దీని అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర విదివిధానాలు రూపొందించింది. ఈ మేరకు మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  మన్మోహన్ సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. మత్స్యరంగ నిర్వహణ – సమీకృత అభివృద్ధి పేరుతో  ఈ విధానాన్ని రూపొందించారు. ఇందులో  భాగంగా జలాశయాల్లో వలలు ఏర్పాటు చేసి వాటిలో చేపల పెంపకం అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్ కు రూ.80 లక్షలు ఖర్చువుతుందనేది అంచనా ఇందులో రూ.40 లక్షలతో వలలు , ఇతర మౌలిక వసతులకు , మరో రూ. 40 లక్షలు  చేపల విత్తనాలు దాణా, వంటి నిర్వహణ ఖర్చులకు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇందులో రూ.36 లక్షలు కేంద్రప్రభుత్వం నుంచి లభిస్తుంది. మిగిలిన మొత్తంరాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయిస్తారు. పెట్టుబడి వ్యయంలో కొంత సబ్సిడీ లభిస్తుంది.  
Source: eenadu