Page:
  1. 1
  2. 2

2020 నాటికి రెట్టింపు ఆక్వా ఉత్పత్తులు 

దేశవ్యాప్తంగా 2020 నాటికి 50 నుంచి 60 బిలియన్ మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తులు వచ్చేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎంపెడా చైర్మన్ డాక్టర్ ఏ.జయతిలక్ ప్రకటించారు.పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం జరిగిన ఆక్వా సదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. అదే విధంగా దేశంలో ఐదు చోట్ల తల్లి రొయ్యల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దానిలో మన రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తామన్నారు. రానున్న మూడేళ్లలో ఇక్కడసాగుకు అవసరమైన స్ధాయిలో నాణ్యమైన రొయ్య పిల్లలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మత్స్యశాఖ రాష్ట్ర కమిషనర్ రమాశంకర్ మాట్లాడుతూ దేశంలో అత్యధికంగా ఆక్వా సాగు జరుగుతున్న ఈప్రాంతంలో ఆ రంగానికి సంబంధించి అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ముఖ్యంగా ఆక్వా పరిశోధన కేంద్రం పశ్చిమలో ఏర్పాటు చేయాలని కోరారు.