Page:
  1. 1
  2. 2

మీసం మెలేసిన రొయ్య( తొలి త్రైమాసికంలో మూడున్నర రెట్లు వృద్ధి)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్ధూల ఉత్పత్తి 2016-17 ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 12.26శాతం వృద్ధి నమోదు చేసింది. రంగాలు , ఉత్పత్తుల వారీగా జీఎస్ డీ పీలో దేని పాత్ర ఎంత అని ప్రభుత్వం లెక్కలు వేసింది . మంచి నీటి చెరువుల్లో పెంచే రొయ్యల ఉత్పత్తిల్లో అత్యధికంగా 349.54 శాతం వృద్ధి నమోదవడంవిశేషం. స్ధూల విలువ జోడింపు పరంగా చూస్తే రూ.56,758 కోట్లతో సేవారంగం ముందంజలో ఉంది. మొదటి త్రైమాసికం ఫలితాలపై ప్రణాళికా విభాగం రూపొందించిన  పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం కలెక్టర్ల సదస్సులో ఆవిష్కరించారు.వ్యవసాయ రంగం 22.92 శాతం , పారిశ్రామిక రంగం 10.49 శాతం , సేవా రంగం 10.16 శాతం, వృద్ధి నమోదు చేశాయి.మొత్తం ఈ మూడు రంగాల నుంచి జీవీఏ రూ.1,07,099 కోట్లు , గత ఏడాది ఇదే త్రైమాసికంలో  జీవీఏ మొత్తం రూ.95,403 కోట్లు .జాతీయ గణాంకాలను పరిశీలించినప్పుడు . ఇదే త్రైమాసికంలో  వ్యవసాయ రంగంలో 1.80. పారిశ్రామిక రంగంలో 6.03, , సేవా రంగంలో 9.58 శాతం వృద్ధి నమోదైంది.
పాలు 14.26 శాతం ,మాంసం 12.68 శాతం, గుడ్ల ఉత్పత్తిలో 14.95 శాతం  వృద్ధి నమోదైంది.
గనుల రంగంలో 12.35 శాతం , ఉత్పాదక రంగంలో 10.83 శాతం ,విద్యుత్ , గ్యాస్, నీటి సరఫరా రంగాల్లో 10.01 ,నిర్మాణ రంగంలో 9.88 శాతం వృద్ధి నమోదైంది. అటవీ విభాగంలో 2.8 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది.


source: ఈనాడు