Page:
  1. 1
  2. 2

ఆక్వాకు వ్యవసాయ హోదా ఇవ్వాలి. (జిఎస్ టి పన్ను నుంచి మినహాయించాలి.‌)

ఆక్వా పరిశ్రమకు వ్యవసాయ హోదా ఇవ్వాలని విశాఖలో ముగిసిన సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రదర్శన  పిలుపు ఇచ్చింది. జిఎస్ టి పన్ను నుంచి కూడా ఈ పరిశ్రమను మినహాయించాలని కోరింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనకు మంచి స్పందన లభించిందని ఎంపెడా ఛైర్మన్ జయతిలక్ చెప్పారు. గత ఏడాది 470 కోట్ల డాలర్లున్న ఆక్వాఎగుమతులను 2020 నాటికి 1000 కోట్ల డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఈ సంవత్సరం ఎగుమతులు 560 కోట్ల డాలర్లకు చేరే అవకాశం ఉందన్నారు. మత్స్య రంగం వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది.అయినా వ్యవసాయ హోదా లేదు. ఈ రంగానికి వ్యవసాయ హోదా కల్పిస్తే మత్స్యకారుల ఆదాయం పెరగడంతో పాటు ఎగుమతులూ పెరుగుతాయి అని సముద్ర ఆహార ఉత్పత్తుల సంఘం (ఎస్ ఇఎ) అధ్యక్షుడు పద్మనాభం చెప్పారు.
source : ఆంద్రజ్యోతి.