Page:
  1. 1
  2. 2

ఆక్వా రైతుల కోసం సరికొత్త పరికరం రూపొందించిన ఆచార్య నాగార్జున వర్సిటీ అధ్యాపకులు

ప్రస్తుత పరిస్తితుల్లో సాంకేతిక రంగం అన్ని రంగాల్లో విస్తరిస్తుంది. కాని వ్యవసాయ, ఆక్వా రంగాల్లో టెక్నాలజీ వినియోగం తక్కువే.  రకరకాల సమస్యలతో నష్టపోతున్న ఆక్వా రైతులకు బాసటగా ఒక సరికొత్త పరికరాన్ని ఆచార్య నాగార్జున వర్సిటీ అధ్యాపకులు రూపొందించారు.

ఆక్వా రంగంలో  తరచూ మారే ఉష్నోగ్రతలలో హెచ్చు తగ్గుల వల్ల ఆక్సిజన్ స్తాయి జలరాసులకు ప్రాణ సంకటంగా మారింది. ఈ పరిస్థితిని నివారించడానికి లేదు. దీనితో రైతులు అనూహ్యంగా నష్టాలను చవిచూస్తున్నారు.  ఈ సమస్య పరిష్కారానికి గుంటూరు ఆచార్య నాగార్జున వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపక సిబ్బంది ఒక పరికరాన్ని రూపొందించారు. సెన్సార్ సహాయం తో పనిచేసే ఈ పరికరం ద్వారా నీటి ఉష్ణోగ్రత హెచ్చు తగ్గులను, ఆక్షిజన్  మరియు నీటి ph స్తాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు , అంతేకాకుండా ఆ సమాచారాన్ని మీరు ఎక్కడ ఉన్న మీ సెల్ ఫోన్ కు మెసేజ్ ద్వారా మీకు తెలియచేస్తుంది. వైర్లెస్ పరిజ్ఞానం తో పనిచేసే ఈ పరికరాన్ని రేపల్లె, గుడ్లవల్లేరు ప్రాంతాల్లో ఎందరో రైతులకు అందించి బాసటగా నిలిచారు.

ఆంధ్రప్రదేశ్ లో ఆక్వా సాగు చేస్తున్న రైతులకు ఈ పరికరం అవసరం చాలా ఉంది. ఇటువంటి సంకేతిక పరిజ్ఞానం  మరింత అబివృద్ది చేసి రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చి ఆక్వా, వ్యవసాయ రంగాలను మరింత పెంచాలని ప్రజలు కోరుకుంటున్నారు.