Page:
  1. 1
  2. 2

రొయ్యకూ ఉక్కపోత 

టంగుటూరు : నీలి విప్లవానికి నాంది పలికిన నాటి నుండి జిల్లాలో రైతులు ముమ్మరంగా ఆక్వా సాగుచేస్తున్నారు .ఖర్చుకు తగ్గుట్టుగానే అధిక రాబడి సైతం వచ్చే రంగం కావడంతో ఆసక్తి చూపే వారి సంఖ్యా అధికంగానే ఉన్నది . ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని నాణ్యమైనా కౌంటు కోసం నిత్యం శ్రమిస్తున్న రైతులకు తాజా పరిస్ధితులు ఆందోళన కలిగిస్తున్నాయి .ఎడాపెడా విధ్యుత్ కోతలతో తీవ్ర నష్టాలు చవిచూస్తారు .గంటల తరబడి సరఫరా నిలిపివేయడంతో చెరువుల వద్ద జనరేటర్లను ఉపయోగించాల్సి  వస్తుంది . దీంతో పెట్టుబడి వ్యయం మరింత పెరిగిపోతుంది .
15 వేల ఎకరాల్లో 
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆక్వా సాగు 12 మండలాల్లోని 27 ఎకరాల్లో ఉండేది . ప్రస్తుతం పునర్విభజన నేపథ్యంలో చీరాల , బాపట్ల , అద్దంకి , కందుకూరు నియోజక వర్గాలు ఇతర జిల్లాలోకి వెళ్లిపోయాయి .కొత్తపట్నం , ఒంగోలు , నాగులుప్పలపాడు , టంగుటూరు , జరుగుమల్లి , సింగరాయకొండ  తదితర ప్రాంతాల్లో 15 వేల ఎకరాలకు సాగు పరిమితమైంది .ప్రస్తుతం నాణ్యమైం దిగుబడి సాధనతో పాటు వైరస్ ల నుండి తట్టుకునేందుకు వనామి రకం రొయ్యను రైతులు అధికంగా సాగు చేస్తున్నారు .వీటి ధరలు అంతంత మాత్రంగానే ఉన్నాయి .30 కౌంటు రొయ్యల ధర బుధవారం మార్కెటులో రూ .530 గా ఉంది . వేసవి కాలం కావడంతో విద్యుతు సంక్షోభం ఏర్పడింది . 3  ఫేజ్ కలిగిన ఆక్వా చెరువులకు విద్యుత్తును నిలిపి వేయడంతో జనరేటర్లపైనే ఆధారపడాల్సి వస్తుంది . నిత్యం అయిదు నుండి ఆరు గంటల వరకు వీటిని వినియోగిస్తున్నారు . సాధారణంగా ఎకరా నుంచి ఆ పైన విస్టీర్ణంలో చెరువులు ఏర్పాటు చేసి ఆక్వా సాగుచేస్తుంటారు . ఎకరా చెరువులో వెనామీ రకం సీడ్ రెండు లక్షల వరకు వేసేందుకు ఆస్కారం ఉంది . వాటికి అందించే మేత 25 కిలోల బస్తా ప్రస్తుత ధర రూ .2500 .. ఈ క్రమంలో ఆరు నెలల పంటకు 2.50 టన్నుల మేత అవసరం . ఇందుకు రూ .2.50 లక్షల ఖర్చవుతోంది .ఔషధాలకు రూ . లక్ష , కూలీ  ఖర్చు రూ .1.50 లక్షల వరకు అవుతోంది .ప్రస్తుతం 40 కిలోవాట్ జనరేటరును  వినియోగిస్తే లీటరు డీజిల్ 3 గంటల వరకు మాత్రమే వస్తుంది .ఇలా గంటల తరబడి పదుల సంఖ్యంలో చెరువులకు జనరేటర్లను వినియోగించాల్సి ఉంటుంది .
source: eenadu