Page:
  1. 1
  2. 2

ఆక్వా లావాదేవీలపై ఇన్‌కంటాక్స్ కన్ను

ఆక్వారంగంలో ఎక్కువ మందిని ఆదాయ పన్ను పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఆదాయ పన్ను(ఐటీ) శాఖ సిద్ధమవుతోంది. తద్వారా వారి నుంచి పన్నులు వసూలు చేయడానికి రంగం సిద్ధంచేస్తోంది. చేపలు, రొయ్యల రైతులు, విక్రయదారులు, కొనుగోలు దారులు లక్షలు, కోట్ల రూపాయల లావాదేవీలు చేస్తున్నారు. ఆదాయ వెల్లడి పథకం-2016(ఐడిఎస్)లో భాగంగా అన్నిరంగాల వారికి పెండింగ్‌ పన్నులను చెల్లించేలా నిర్ణయించారు. అయినా ఆక్వారంగం నుంచి నామమాత్రపు స్పందన లభించిందని విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఇక నేరుగా నోటీసులు, ప్రాసిక్యూషన్‌కు సిద్ధపడతామని అధికారులు ప్రకటించారు.

Source : Andhrajyoth