Page:
  1. 1
  2. 2

ధరహాసం 

చీరాల : జిల్లాలో రొయ్యల ధరలు పుంజుకుంటున్నాయి . రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలున్నాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు . నిన్నా ..మొన్నటి వరకు ఆక్వా రైతును ఒక వైపు ధరలు పతనం ... మరో వైపు వైరస్ లు వెంటాడి వేధిస్తూ పెరుగుదల లేకపోవడంతో అతలాకుతలం చేశాయి . ఈ క్రమంలో టన్ను రొయ్యలపై రూ . లక్ష నుంచి రూ .1.50 లక్షల వరకూ పెరగడం తో ఆక్వా రైతుల ఆశలు చిగురిస్తున్నాయి . చాలా కాలం తర్వాత  మళ్ళి రొయ్య మీసం లేసింది .రోజురోజుకు ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి . ఐదేళ్ళలో ఎన్నడూ చూడని ధరలు ప్రస్తుతం చూస్తున్నారు .ఐదు నెలలుగా రొయ్యల ధరలు గణనీయంగా పెరగడంతో జిల్లాలోని ఆక్వా రైతులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు . గతంలో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేకుండా ప్రాసెసింగ్ యూనిట్ నిర్వాహకులు , దళారులు , పెట్టుబడిదారులు చెప్పిందే ధారగా ఉండేది . ఆరుగాలయం శ్రమించి పండించిన  ఆక్వా ఉత్పత్తులను తెగనమ్ముకోవాల్సి ఉంది రాష్ట్రాన్ని ఆర్ధికంగా పరుగులు పెట్టించడంలో ఆక్వా రంగం ప్రధాన పాత్ర పోషిస్తోంది . రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రంగాన్ని ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి రొయ్యల సాగు అభివృద్ధికి ప్రాధికార సంస్ధ యాక్టు -2020 అమల్లోకి తీసుకొచ్చారు . తద్వారా మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్ , ఫీడ్ తో పాటు గిట్టుబాటు ధర కలించడం ప్రధాన లక్ష్యం . జిల్లాలో ప్రస్తుత సీజన్ లో ఆరు వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది . ఉత్పత్తులు రావడం మొదలయ్యాయి .ఈ తరుణం లోనే రొయ్యల ధరలు భారీగా పెరిగాయి . కిలోకు రూ .100  నుంచి రూ .150 పెరిగినట్లు ఆక్వా రైతులు చెబుతున్నారు . 
ధరలు ఎందుకు పెరిగాయంటే ...
విదేశి మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్న రొయ్యల సాగు వరస నష్టాలతో కునారిల్లింది . వైట్ కట్  , విబ్రియో , తెల్లమచ్చల వంటి వైరస్ లతో ఆక్వా రైతులు దివాళా తీశారు . దీనికి తోడు మూలిగే నక్క పై తాటి కాయ పడిన చందంగా రెండేళ్ల పాటు లాక్ డౌన్ తో విదేశాల ఎగుమతులు నిలిచిపోయాయి . దీంతో పంట ఉత్పత్తుల ధరలు పడిపోయాయి .ఈ పరిస్ధితుల్లో మళ్ళి  విదేశి ఎగుమతులు గణనీయంగా ఊపందుకున్నాయి. చైనా వంటి దేశాలు రొయ్యల ఉత్పత్తి దిగుమతి చేసుకుంటున్నాయి . దీంతో పాటు ప్రభుత్వం డవలొప్మెంట్ అధారిటీ ద్వారా గిట్టుబాటు ధర కలించడంతో ధరలు పెరిగి రొయ్య మీసం మెలేస్తోంది . రైతుల కళ్ళలో ఆనందం నింపుతోంది .

source : sakshi