Page:
  1. 1
  2. 2

మీసం మెలేసింది !

చీరాల : మెల్లగా అన్ లాక్ 5.0 అల్లుకుపోతుంది . దాదాపు అన్ని రంగాల్లో ఉత్పత్తి , అమ్మకాలు మెరుగయ్యాయి . అలాగే లాక్ డౌన్ ఆంక్షల అనంతరం ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు పూర్తీ సామర్ధ్యంతో పనిచేస్తున్నాయి . ముఖ్యంగా సముద్ర మార్గంలో విదేశాలకు ఎగుమతులు జోరందుకున్నాయి .కృష్టపట్నం , కాకినాడ , విశాఖ పోర్టుల ద్వారా రొయ్యలతో పాటు చేపలను కూడా కంటైనర్లలో ప్యాక్ చేసి యూస్ , ఈయూ  , చైనా , జపాన్ , వంటి దేశాలకు మెట్రిక్ టన్నుల వంతున చేరవేస్తున్నారు .  ఈ  ఎగుమతుల్లో సింహ భాగం యూఎస్ కే . అక్కడకు ఏటా 41 శాతం , ఆ తరువాత చైనాకు 23 , ఈయూ కు 10 శాతం చొప్పున మార్కెట్ చేయగలుగుతూన్నారు . రాష్ట్ర వ్యాప్తంగా  ఎక్సపోర్ట్ జరుగుతుంటే కేవలం ప్రకాశం జిల్లా నుంచే ఏటా సుమారు 5 వేల మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పతులు చేరవేయడం విశేషం .అంటే వీటి విలువ దాదాపు రూ .300 కోట్లు .జిల్లా నుంచి సరుకంతా కాకినాడ పోర్టుకే తరలిపోతోంది .
ఆలకించిన ప్రభుత్వం 
కరోనా కాలంలో ఒడిదుడుకుల్లో ఉన్న ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది . గిట్టుబాటు ధర లభించేలా కృషి చేసింది .వంద కౌంటు కేజీ రొయ్యను రూ180 మేర కొనుగోలు చేయాలని వ్యాపారులను ఆదేశించడంతో ఒక్క సారిగా పరిస్ధితిలో మార్పు వచ్చింది .
ఆక్వా అధారిటీ బోర్డు ఏర్పాటు చేయడం మార్కెట్  ఇంటెలిజెన్సు సేవలు , ఎగుమతులపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం  సీడ్ , ఫీడ్ లతో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడటం వంటి చర్యలు ఆశావహ దృక్పధాన్ని పెంచాయి . అధికారులు ఇన్ని రకాల చర్యలు తీసుకున్నా ప్రాసెసింగ్ యూనిట్లు 40 నుంచి 60 శాతం మేరే  పని చేశాయి . మే రెండో వారం నుంచి విదేశాల నుంచి కొత్తగా వ్యాపారం పెరగడం యధాస్ధితికి చేరుకుంది . ప్రస్తుతం వంద కౌంటు ధర రూ .230 గా ఉండగా .. 30 కౌంటు ధర రూ .470 పలుకుతోంది .తాజాగా పంట తీస్తున్న రైతులకు ఆదాయం బాగా వస్తోంది . ప్రస్తుతం కాకినాడ కృష్ట్ణపట్నం పోర్టుల నుంచి నౌకల ద్వారా 90  శాతం ఎగుమతులను పునరుద్ధరించారు . జిల్లాల్లో 10 ప్రాసెసింగ్ యూనిట్లు కళకళలాడుతున్నాయి .
source : sakshi