Page:
  1. 1
  2. 2

చెరువులలో స్టాకింగ్ జరిపిన తరువాత చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు

•రిజర్వాయర్ నీటిని వాడాలి మరియు ఆ నీటిని పెంపకపు చెరువులో తీసుకోవటానికి 10-15 రోజులు ముందుగానే రిజర్వాయరులో నీటిని స్ధిరపరచాలి.
•వీటి మార్పిడి మరియు వర్షము కురిసిన తరువాత సాగుచెరువులో వ్యవసాయ సున్నమును వాడుతుండాలి.
•హానికరమైన నిషేధించబడిన రసాయనాలు వాడరాదు. రొయ్యలకు మేత ఎంత అవసరమో తెలుసుకోవటానికి ఫీడ్  చెక్ ట్రేలను వాడాలి.
•సాగు చెరువులో పడవలు ,తెప్పలను వుపయోగించి మేతను చెరువంతా ఇవ్వడం ద్వారా మలినాలు ఏర్పడకుండా నివారించవచ్చు
•నీటి అడుభాగన ఏర్పడే ఆల్గా జాతిజీవులను క్రమం తప్పకుండా తొలగిస్తూ వుండాలి.
•సరైన నీటి పి.హెచ్ ,ఆల్కలినిటి మరియు కరిగిన ఆక్సిజన్ పరిమాణాల ఉండేటట్లు తగిన చర్యలు తీసుకొనడానికి క్రమ పద్ధతిలో నీటి నాణ్యతలను పరీక్షిస్తూ ఉండాలి.
•అత్యవసర పరిస్ధితులలో మాత్రమే నీటి మార్పిడి చేయాలి.
•వారానికి ఒక సారి సాగు చెరువుల అడుగు భాగాన్ని పరీక్షించి చెడు వాసనలు వచ్చే నల్లని నేల మట్టిని తొలగించాలి.
•రొయ్యల పెరుగుదలను నిర్ణీత సమయంలో గమనించాలి.