Page:
  1. 1
  2. 2

నాణ్యమైన రొయ్య పిల్లలు అందుబాటులో ఉంచాలి 

ఆక్వా రైతులకు నాణ్యమైన రొయ్య పిల్లలను అందించాలి . ఒక్కో రొయ్య పిల్లలను కేవలం 35 పైసలు , అంతకు తక్కువ ధరకు అందించాలని జిల్లా మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ ఆవుల చంద్ర శేఖరరెడ్డి హేచరీల యజమానులు ఆదేశించారు . స్థానిక ఓల్డ్ రిమ్స్ లోని తన కార్యాలయంలో హేచరీల యజమానులతో సోమవారం సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆవుల చంద్రశేఖరెడ్డి మాట్లాడుటూ ఆక్వా రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు . అందులో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వులకు సంభందించిన జీఓ లోని అంశాలను హేచరీల యజమానులకు వివరించారు . కోవిద్ - 19 వైరస్ వ్యాధితో ఆక్వా రైతులు వేసవి రొయ్యల పంటను తక్కువ రోజుల్లోనే పట్టారని, తిరిగి , మే, జూన్ నెలల్లో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని , దీన్నిఆసరాగా చేసుకొని రొయ్య పిల్ల ధర పెంచితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు . ఏ హేచరీ యజమాని అయినా ఇంతకంటే ఎక్కువ ధరకు రొయ్యపిల్లలను అమ్మితే వెంటనే ఫిర్యాదు చేయాలని రైతులకు సూచించినట్లు పేర్కొన్నారు . ప్రతి హేచరీ వద్ద ఒక నోడల్ అధికారిని నియమించినట్లు పేర్కొన్నారు . నాణ్యాతా ప్రమాణాలను హేచరీ యజమానులు తప్పకుండా పాటించాలన్నారు . సమావేశంలో మత్స్యశాఖ ఏడీ రంగనాధ్ బాబుతో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు .
source : sakshi