Page:
  1. 1
  2. 2

రొయ్య పిల్లలకు రేటు ఫిక్స్ 

అమరావతి : రొయ్య పిల్లల్ని ఎప్పుడైనా ఒకే ధరకు  రైతుకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది . ఒక్కో పిల్లను 30 నుంచి 35 పైసలోపు విక్రయించేలా హేచరీల నిర్వాహకుల్ని ఒప్పించింది . ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది .రాష్ట్ర , మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపి దేవి వెంకట రమణారావు హేచరీల నిర్వాహకులు , రైతులతో విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా సోమవారం చర్చలు జరిపారు .అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ... చర్చలు ఫలప్రదమయ్యాయని చెప్పారు .చర్చల్లో అంశాలిలా ఉన్నాయి .
1 .గతంలో రొయ్య పిల్లల ధరలు ఊపందుకున్న తరువాత హేచరీల యజమానులు సీడ్ ధర పెంచేసేవారు .దీని వల్ల సీడ్ కొన లేక రొయ్యల  రైతులు సాగును మానేసిన పరిస్ధితులుండేవి .
2 .  2020 ఎప్పుడైనా రొయ్య పిల్ల ధర 35 పైసలకు మించకూడదు .హేచరీల నిర్వహాకులు అందుకు అంగీకరిస్తేనే వారికి ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని చెప్పిన మంత్రి .
3 . లాక్ డౌన్ కారణంగా కార్మికుల కొరత , నిర్వహణ ఖర్చులు పెరిగి పోయాయి .అంతర్జాతీయ విమాన సర్వీసులు లేకపోవడం వల్ల అమెరికా నుంచి బ్రూడ్ స్టాక్ (తల్లి రొయ్యలు )దిగుమతి చేసుకునే అవకాశం లేకపోయింది . కేంద్రంతో చర్చించి కార్గో సర్వీసులు ప్రారంభించేలా చూడాలన్న హేచరీల నిర్వాహకులు .
source : sakshi