Page:
  1. 1
  2. 2

సంక్షోభంలో రొయ్య రైతులు

 సకల జీవ రాశులకు వర్షమే జీవనాధారం . సృష్టిలో ఏ పంట పండాలన్న వర్షం అవసరం . ఇంట ప్రాధాన్యం ఉన్న వర్షం నాలుగేళ్లుగా రొయ్య రైతులకు కంటి మిడియా కునుకు లేకుండా చేస్తోంది . ముఖ్యంగా రొయ్యల చెరువులు, హెచ్చరియు యజమానులు పరిస్ధితి దయనీయంగా మారింది. వీరు కేవలం వర్షంపై ఆధారపడి ఉన్నారు . వర్షం పడకపోదా.. అని హేచరీలో రొయ్య పిల్లలు తయారు చేస్తున్నారు , ఎప్పుడు వర్షం పడితే అప్పుడు రొయ్య పిల్లలకు డిమాండ్ ఉంటుంది . రెండేళ్లు నుంచి రొయ్య పిల్లలు విక్రయం మందగించింది . ఈ ఏడాది ఆగష్టు నుంచి వర్షం పడుతుందని ఎదురుచూశారు . జిల్లా వ్యాప్తంగా ఒక్క కొత్తపట్నం మండలంలో 23 హేచరీలు ఉన్నాయి . మన మండలంలో ఉన్న రొయ్య పిల్లలకు మంచి గిరాకి ఉంటుంది. హేచరీలో పద్ధతులు పాటించి నాణ్యమైన రొయ్యపిల్ల లను తయారు చేసుంటారు. ఇతర జిల్లాలు , రాష్ట్రాల నుంచి మండలానికి రొయ్య పిల్లల కోసం వస్తూ ఉంటారు. ఆగస్టు నుంచి రొయ్య పిల్లలు తయారవుతూ ఉంటాయి. ఆగష్టు నుంచి అడపాదడపా  వర్షాలు పడటంతో చెరువులో   ఉప్పు శాతం తగ్గి రొయ్య పిల్లలు పెరుగుతులు ఉంటాయి. వదిలిన రొయ్య పిల్లలు గుల్ల వదలక పెరుగుదల ఆగిపోయిందని రొయ్య రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో సుమారు 9 వేళా ఎకరాలకు 2 వేళా ఎకరాల్లో మాత్రమే స్టాక్ చేశారు . అవి కూడా వర్షం పడక గీతకబారినట్లు యజమానులు చెబుతున్నారు. తయారైన రొయ్య పిల్లలను సముద్రంలో వదిలేస్తున్నారు.వర్షం పడకపోడా అని అధికంగా  ఖర్చు చేసి రొయ్య పిల్లలను తయారు చేస్తున్నారు. రొయ్య చెరువుల యజమానులు రాకపోవడంతో రొయ్య పిల్లలను సముద్రంలో వదిలి పెడుతున్నామని హేచరీ యజమానులు పేర్కొంటున్నారు.బ్లాడర్స్ నుంచి గుడ్లు పెట్టిన 20  రోజులు మాత్రమే హెచ్చరియలో ఉంచుతున్నారు. 12  నుంచి 20 రోజుల్లోపు పిల్లలను చెరువుల్లో వదులుతారు.అంతకు మించి రోజులు గడిస్తే చెరువుల్లో రొయ్య పిల్లలు వదలకూడదు .ఈ పరిస్థితి ఎప్పుడు లేదని హెచ్చరియు కార్మికులు , యజమానులు వాపోతున్నారు . కొన్ని హెచ్చరియలి మూతేసి ఖాళి చేస్తున్నారు . ఒక్కో హెచ్చరియుల్లో లక్ష రూపాయలు నష్టం వాటిందని యజమానులు వాపోతున్నారు. ఒక్కో హెచ్చరిలో 50 మంది కూలీలు పని చేస్తున్నారు . ఉపాధి లేక ప్రత్యామ్యా పని చూసుకుంటున్నారు. ప్రభుత్వం హేచరీయులను కాపాడాలని వాటి యజమాను కోరుకుంటున్నారు  .

source : sakshi