Page:
  1. 1
  2. 2

వెనామీ రొయ్యల్లో తెల్ల ఆహారనాళ సమస్య

వెనామీ సాగులో వైట్ గట్  పెరుగుతోందని శ్రీ పొట్ట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మత్స్య కళాశాల అసోసియేట్ ప్రొపిసర్ హరిబాబు తెలిపారు. 2009 లో కేంద్ర ప్రభుత్వం రైతుస్ధాయిలో వెనామీ సాగుకు ఆమోదం తెలిపింది. 2009నుంచి 2013 వరకు ఈ రొయ్యల ఉత్పత్తిలో తెల్లమచ్చల వైరస్ మినహా ప్రతికూలాంశాలు కనింపించలేదు.2009 సుమారు 25 హేచరీలకు కోస్టల్ అక్వాకల్చర్ అధారీటీ అనుమతివ్వగా.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వెనామీ హేచరీల సంఖ్య 350 – 400 పెరిగింది. రొయ్యల ఉత్పత్తి కూడా ఇదే స్ధాయిలో గణనీయంగా పెరిగింది. ఈ పెరుగుదల మూలంగా అంతర్జాతీయ మార్కెట్లో తల్లి రొయ్యల నాణ్యత ప్రశ్నార్ధకంగామారింది. హేచరీల్లో వాడే లైవ్ ఫీడ్స్ రోగకారకాలుగా ఉండటం, తక్కువ నీటి నాణ్యత వంటివి రొయ్యల దిగుబడి క్షీణించేలా చేస్తున్నాయి. ముఖ్యంగా వ్యాధి కారకాలైన విబ్రియో , పారా , ఎమోలిటేకస్ రకాలు చెరువులో నీటి ఉప్పదనం, నీటి  ఉష్ణోగ్రత అధికమైనప్పుడు రొయ్యలపైఒత్తిడి కలిగిస్తాయి.వ్యాధికారక బ్యాక్టీరియావిడుదల చేసే టాక్సిన్ మూలంగా రొయ్యల్లో వైట్ గట్ సమస్య ఏర్పడుతోంది. 2014 – 2015 లో 60 రోజుల పంటకాలం తర్వాత వైట్ గట్ సమస్య కనిపించేది. 2016 -2017 నాటికి 30 – 40 రోజులకే వైట్ గట్ సమస్య మొదలవుతోంది. ఈ పరిస్ధితి రొయ్య విత్తన నాణ్యత తగ్గించడానికి ప్రత్యక్ష నిదర్శనం.  
రొయ్యలకు ప్రత్యమ్నాయంగా ..
 రొయ్యల సాగుకు ప్రత్యమ్నాయంగా పండుగప్ప , మిల్క్ ఫిష్, పీతల పెంపకాన్ని చేపట్టవచ్చు .సీబాస్ పెంపకాన్ని కేజ్ కల్చర్ ద్వారా చేస్తే మంచిది. దీనిలో చేపలను ఎప్పటికప్పుడు గ్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. వీటి పెంపకం లాభదాయకం.
రోగ లక్షణాలు :
•రొయ్య మేత తినటం మందగిస్తుది. 
•ఆహరనాళం ఖాళీగా లేదా లేత పసుపు రంగులో ఉంటుంది. 
•రొయ్యల బతుకుదల శాతం వ్యాధి తీవ్రతను బట్టి గణనీయంగా పడిపోతుంది.
•వైట్ గట్  వ్యాధి బారిన పడిన రొయ్యలను పట్టుబడి చేయడమే ఉత్తమం 
•వైట్ గట్ వ్యాధి నివారణకుప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న మందుల నాణ్యత సందేహాస్పదంగా ఉంటోంది. రైతులు నమ్మకమైన సాంకేతిక నిపుణుల సూచనలు తీసుకోవాలి.   
వ్యాధి అదుపునకు చర్యలు : 
•రైతులు తప్పనిసరిగా ఎస్ పీ ఎఫ్ సీడ్ ను ఆమోదం పొందిన హేచరీల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి . చెరువు నీటి సెలినిటీకి తగినట్టుగా రొయ్య పిల్లలను ఎంపిక చేయాలి . పరిశీలన నిమిత్తం ముందుగా సీడ్ శాంపిళ్లను హపాలో 48 గంటలు ఉంచి బతుకుదల శాతం 90 శాతం ఉన్నప్పుడే ఆ సీడ్ ను వేయాలి.రిజర్వాయర్ చెరువును నిర్మించుకుంటే మంచిది. ఆ చెరువులోకి నీటిని తోడి , 15 రోజుల పాటు సెడిమెంటేషన్ కు గురిచెయాలి. రిజర్వాయర్ చెరువు లోతును బట్టి తగిన మోతాదులో బ్లీచింగ్ పొడి వేసి నాణ్యమైన నీటిని పెంపక చెరువులోకి తోడాలి
•విధిగా ష్రింప్ టాయిలెట్స్ ను నిర్మించాలి .వెనామీ రొయ్యలకు విధిగా ప్రతిరోజు కనీసం ఒక మేత లోనైనా మినరల్స్  అందించాలి. లక్ష రొయ్య పిల్లలకు 10 -15 కిలోల మినరల్ మిక్చర్ అందించాలి.
•మినరల్స్ తో పాటు నాణ్యమైన మేత , ప్రోబయోటిక్స్ , మంచి నీటి శానిటైజర్స్ ను వాడితే మేలైన ఫలితాలు వస్తాయి.వైట్ గట్ , వైట్ మసిల్ వంటి వ్యాధులు సంభవించినప్పుడు , కిలో మేతకు వెల్లుల్లి పేస్టు 50 గ్రా+ అల్లం పేస్టు 10 గ్రా.+ పసుపు 7 గ్రా. చొప్పున మేతల ద్వారా అందిస్తే సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. 
•వెనామీ రొయ్యల వృద్ధి కాల్షియం , మెగ్నీషియం లపై ఆధారపడి ఉంటుంది. కనుక రైతులు మెగ్నీషియం క్లోరైడ్నుప్రతీ ఎకరాకు 5 – 20 కిలోలు వరకు అందించాలి.
•మేతలను అవసరానికి మించి అందించకూడదు. 
Source ; eenadu prakasam