Page:
  1. 1
  2. 2

మత్స్యరంగ అభివృద్ధికి రూ. 7,522 కోట్లతో నిధి

విశాఖపట్నం : కేంద్ర ప్రభుత్వం మత్స్యసంపద అభివృద్ధికి రూ. 7,522 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసిందనికేంద్ర పశుపోషణ , డెయిరీ, మత్స్య శాఖల సంయుక్త కార్యదర్శి  డాక్టర్ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ రంగంలో మౌలిక వసతుల పెంపునకు నిధులు వెచ్చించడంతో పాటు మత్స్య రైతులు , వ్యాపారులు , పారిశ్రామిక వేత్తలకు 12 సంవత్సరాల కాలపరిమితితో  6 శాతం వడ్డీకి రుణాలు అందిస్తారన్నారు. జాతీయ మత్స్య రైతుల దినోత్సవం సందర్భంగా జాతీయమత్స్య అభివృద్ధి సంస్ధ ఆధ్వర్యంలొ విశాఖ ఏర్పాటు చేసిన రెండురోజుల సదస్సును ఆయన సొమవారం ప్రారంభించారు. దేశంలోని19.50 లక్షల మంది  మత్స్యకారులకు బయోమెట్రిక్ కార్డులుఅందించామన్నారు. రొయ్యల్లో యాంటీబయోటిక్స్ వినియోగం తగ్గించేందుకు  తగిన అవగాహన కల్పించడం కోసంఈ నెల 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ ఎఫ్ డీ బీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అధిక విలువ కలిగిన చేపల ఉత్పత్తికి ,మత్స్యరంగ అభివృద్ధికి మత్స్యశాఖ కృషి చెస్తోందని రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్ పేర్కొన్నారు. సదస్సులో ఎన్ ఎఫ్ డీ బీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఐ. రాణికుముదిని , ఎగ్జిక్యూటివ్ డైరైక్తర్లు రతన్ రాజు , బీకే చంద్ తదితరులు పాల్గొన్నారు.
Source : eenadu