Page:
  1. 1
  2. 2

వాడిన నీటిని వాడకూడదు

ఒకసారి రొయ్యల సాగుకు వాడిన నీటిని తిరిగి వాడితే నల్లమొప్పల వ్యాధి  సోకే ప్రమాదం ఉందని ముత్తుకూరు మత్స్య కళాశాల అసోసియేట్  డీన్ డాక్టర్ షి. హరిబాబు తెలిపారు.సాధారణ స్ధాయులో వర్షపాతం లేని ప్రాంతాల్లో నీటి నాణ్యత దిగజారే ప్రమాదం ఉంటుంది. అలాంటి చోట్ల సాగు విస్తరణ మంచిది కాదు . పట్టూబడి చేసిన గుంతల్లోని నీటినే మరో సాగుకు ఉపయోగిస్తే వెనామీ పెరుగుదల ఆగిపోతుంది. వీలైన రైతులు రిజర్వాయర్ వ్యవస్ధను ఏర్పాటూ చేసుకోవడం ఉత్తమం . గతంలో పోల్చితే విత్తన నాణ్యత తగ్గిపోయింది. దీంతో పిల్లల బతుకుదల శాతం తగ్గుతోంది. వైట్ గట్ , బ్లాక్ గిల్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయి. ఆక్వా రైతులు ఒకేసారి మూకుమ్మడి పట్టుబడి చేయకూడదు. ఇలా చేసినప్పుడు ఐసు అందుబాటు తగ్గుతుంది. ప్రాసెసింగ్ ప్లాంట్ల సామర్ధ్యం క్షీణిసుంది. మార్కెట్ లో ధరలు పడిపోతాయి. కొంత మంది అనుభవం లేని మందులను వాడాలని సూచిస్తుండటంతోరైతులు రొయ్యల సాగులో నష్టాల్ని చవి చూస్తున్నారు. చెరువులో ఇబ్బడిముబ్బడిగా  మేత వినియోగించకూడదు. నాణ్యమైన పిల్లలఎంపికతో పాటూ సాగు విస్తీర్ణం పెరగకుండా చూసుకుంటే దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది.
Source : eenadu