Page:
  1. 1
  2. 2

రొయ్యల సాగులో యాంటీబయోటిక్స్ వద్దు:

బాపట్ల : ఆక్వారంగంలో యాంటీబయోటిక్స్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలని రాష్ట్రమత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్  సూచించారు. పట్టణంలోని ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్ధ కార్యాలయంలో బుధవారం రాష్ట్రమత్స్యశాఖ  ఆధ్వర్యంలో నిర్వహించిన నిషేధిత   యాంటీబయోటిక్స్ వాడకం అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏడాదికి రూ. 17 వేల కోట్ల విలువైన వ్యాపారం సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా జరుగుతుందన్నారు. దేశం మొత్తంలో 40 శాతం ఆక్వా ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ నుంచేఎగుమతి అవుతున్నాయన్నారు. ఇటీవల ఎగుమతి అయిన రొయ్యల్లో యాంటీబయోటిక్స్ అవశేషాలు ఉన్నట్లు గుర్తించిన కొన్ని దేశాలు రొయ్యల కంటైనర్లనుతిరస్కరించాయన్నారు. దీంతో కొంతమేర  దేశానికి విదేశీ నష్టం వాటిల్లిందన్నారు. వ్యవసాయ రంగానికి అనుబంధంగా దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్నిఅర్జించి పెట్టే రొయ్యల్లో యాంటీబయోటిక్స్ అవశేషాలు ఉండటానికి గల కారణాలను రైతులు , ఆక్వా రంగ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు గుర్తించనున్నారన్నారు.అందుకుగాను  రాష్ట్రంలో ఆక్వా రంగానికి సంబంధించిన 199 క్లసటర్లుఏర్పాటు చేసినట్లు చెప్పారు.  క్లస్టర్ల పరిధిలో నిపుణులుసలహాలు, సూచనలిస్తారన్నారు.
Source: sakshi