Page:
  1. 1
  2. 2

చెరువుల్లో యాంటీబయోటిక్స్ వద్దు

ఆక్వా రైతులు చెరువుల్లో యాంటీబయోటిక్స్ మందులను నిషేధించాలని మత్స్యశాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్ కోరారు. కృష్టా జిల్లా కైకలూరు మత్స్య శాఖ కార్యాలయంలో రైతులు , ఆక్వా దుకాణ యజమానులతో యాంటీబయోటిక్స్ వాడకంపై  అవగాహన కల్పించేందుకు శుక్రవారం సమావేశం  నిర్వహించారు. రామ్ శంకర్ నాయక్ మాట్లాడుతూ ఇటీవల విదేశాలకు ఎగుమతి చేసిన రొయ్యల కంటైనర్లలో  రసాయన అవశేషాలు గుర్తించి వెనక్కి పంపించారని తెలిపారు. పరిశిని అదుపు చేయడానికి ప్రభుత్వం  రెండు కమిటీలను నియమించిందన్నారు. యూరోపియన్దేశం నుంచి నవంబర్ 25 న యాంటీబయోటిక్స్ అధ్యయానికి కమిటీ వస్తుందన్నారు. 9 తీర ప్రాంతజిల్లాల్లో యాంటీబయోటిక్స్ వాడకంపై రైతులకు అవగాహనకల్పిస్తున్నామని 
Source : sakshi