Page:
  1. 1
  2. 2

ఆక్వా యూనిట్ల తనిఖీకి కమిటీ

కోస్తా జిల్లాలోని చేపలు, రొయ్యల చెరువుల్లో యాంటీబయాటిక్స్ వినియోగం తదితర అంశాల పరీశీలనకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రెండు కమిటీలను నియమించింది. రసాయనాల వినియోగం కారణంగా విదేశాలకు ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశం లేకపోవడంతో అత్యున్నత  స్ధాయి కమిటీ , టాస్క్ ఫోర్స్ కమిటీలను ప్రభుత్వం నియమించింది. అత్యున్నత  స్ధాయి కమిటీకి రాష్ట్ర వైద్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చైర్మన్ గా. పశుసంవర్ధక శాఖ మంత్రి సీహెచ్ ఆదినారాయణరెడ్డి , ఏపీఐఐసీ చైర్మన్ డాక్టర్ పి. కృష్ణయ్య , కోస్టల్ ఇండియా డెవలప్ మెంట్ కౌన్సిల్  చైర్మన్ డాక్టర్ జీవిఆర్. శాస్త్రి, మత్స్య రంగ నిపుణుడు డాక్టర్ విజయగుప్త, రాష్ట్ర ఆర్ధిక అభివృద్ది మండలి చైర్మన్ ఎస్ పీ టక్కర్  సభ్యులుగా ఉంటారు.ఉభయ గోదావరి కృష్టా, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు సలహా సంప్రదింపుల సభ్యులుగా ఉంటారు. పశు సంవర్ధక  , మత్స్య, పాడి పరిశ్రమలశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి  కన్వీనర్ గా ఉంటారు.
మత్స్యశాఖ కమిషనర్ చైర్మన్ గా టాస్క్ ఫోర్స్ కమిటీ 
టాస్క్ ఫోర్స్ కమిటీ కి మత్స్యశాఖ కమిషనర్ చైర్మన్ గా మరో 8 శాఖల ప్రతినిధులు సభ్యులుగాఉంటారు. కాకినాడలోని మత్స్యశాఖ ప్రతినిధి వమంవయకర్తగా ఉంటారు. టాస్క్ ఫోర్స్ కమిటీ కోస్తా జిల్లాల్లో పర్యటించి 20 రోజుల్లో సర్వే నివేదికను ప్రభుత్వానికి అందించనుంది.
Source : sakshi