Page:
  1. 1
  2. 2

తిరుగులేని మత్స్య పరిశ్రమ

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరంలో మత్స్య రంగంలో  తాము 30.52 శాతం వృద్ధి లక్ష్యంగా పెట్టుకోగా, 40.75 శాతం వృద్ధి నమోదయిందని వ్యవసాయ, మార్కెటింగ్, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు  తెలిపారు. విశాఖ జిల్లాలో క్వారంటైన్ సదుపాయం, గుంటూరు జిల్లాలోని సూర్యలంక వద్ద పండుగప్ప, బురద పీతలు హేచరీల ఏర్పాటుకు రూ.75 కోట్లు కేటాయించామన్నారు. వీటికి ఎంపెడా సవివర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసి , ప్రాజెక్ట్ అమలు చేయాల్సి ఉందని , కానీ చర్చలు జరిగి ఏడు నెలలు జరుగుతున్నా ఆసంస్ధ ముందుకు రావడం లేదని ఆయన తెలిపారు. ఈవిషయమై కేంద్ర వాణిజ్యశాఖమంత్రి నిర్మలా సీతారామన్ తో మాట్లాడామని , ఎంపెడా అధికారుల్ని వెంటనే ఆదేశిస్తానని ఆమె హామీ ఇచ్చారని వెల్లడించారు. ప్రత్తిపాటి పుల్లారావు  సోమవారం సచివాలయంలో మత్స్య శాఖపై ఉన్నతాధికారులతో సమీక్షించారు.